Meghalaya : బీఫ్ తినే అలవాటుపై మేఘాలయ బీజేపీ చీఫ్ సంచలన వ్యాఖ్యలు
ABN, First Publish Date - 2023-02-24T14:21:45+05:30
మేఘాలయలో ఓ పశువధ శాల ఉందన్నారు. ప్రతివారూ ఓ ఆవును కానీ, ఓ పందిని కానీ అక్కడికి తీసుకెళ్ళి, మాంసాన్ని మార్కెట్‌కు పట్టుకెళ్తారని
షిల్లాంగ్ : బీఫ్ తినడం తమ జీవనశైలిలో భాగమని, తాను కూడా తింటానని బీజేపీ మేఘాలయ శాఖ అధ్యక్షుడు ఎర్నెస్ట్ మావ్‌రీ (Ernest Mawrie) చెప్పారు. మేఘాలయలో బీఫ్ తినడంపై ఎటువంటి ఆంక్షలు లేవన్నారు. దీనిపై ఇతర రాష్ట్రాల్లో ఆమోదించిన తీర్మానాల గురించి తానేమీ చెప్పబోనని తెలిపారు. మేఘాలయ (Meghalaya)లో ప్రతి ఒక్కరూ బీఫ్ తింటారని చెప్పారు. దీనిని ఎవరూ ఆపలేరన్నారు. భారత దేశంలో కూడా అటువంటి నిబంధన ఏదీ లేదని చెప్పారు.
ఎర్నెస్ట్ మావ్‌రీ గురువారం ఓ వార్తా సంస్థతో మాట్లాడుతూ, బీఫ్‌పై ఇతర రాష్ట్రాల్లో ఆమోదించిన తీర్మానాల గురించి తానేమీ మాట్లాడబోనని చెప్పారు. మేఘాలయలో ప్రతి ఒక్కరూ బీఫ్ (Beef) తింటారని చెప్పారు. దీనిని ఎవరూ ఆపలేరన్నారు. భారత దేశంలో కూడా అటువంటి నిబంధన ఏదీ లేదని చెప్పారు. బీఫ్ తినడం తమ జీవనశైలిలో భాగమని, తాను కూడా తింటానని తెలిపారు.
మేఘాలయలో ఓ పశువధ శాల ఉందన్నారు. ప్రతివారూ ఓ ఆవును కానీ, ఓ పందిని కానీ అక్కడికి తీసుకెళ్ళి, మాంసాన్ని మార్కెట్‌కు పట్టుకెళ్తారని చెప్పారు. ఇది పరిశుభ్రంగా ఉంటుందన్నారు.
బీజేపీ (BJP) క్రైస్తవ వ్యతిరేక పార్టీ అని వస్తున్న విమర్శలను తోసిపుచ్చారు. ఇది కేవలం రాజకీయ ప్రచారమని తెలిపారు. ముఖ్యంగా కాంగ్రెస్, టీఎంసీ ఈ ఆరోపణలు చేస్తున్నాయని మండిపడ్డారు. ఎన్డీయే ప్రభుత్వ పరిపాలన తొమ్మిదేళ్ళ నుంచి జరుగుతోందని, ఈ సమయంలో ఏ చర్చిపైనా దాడి జరగలేదని చెప్పారు. క్రైస్తవులు అత్యధికంగా ఉంటూ, ఆధిపత్యం చలాయించే రాష్ట్రం మేఘాలయ అని, తాము ఆ రాష్ట్రంలో ఉన్నామని, ఇక్కడ ప్రతి ఒక్కరూ చర్చికి వెళతారని తెలిపారు. బీజేపీ పాలనలోని గోవా, నాగాలాండ్‌లలో కూడా చర్చిలపై దాడులు జరగలేదన్నారు.
అస్సాం వంటి బీజేపీ పాలిత రాష్ట్రాల్లో పశు వధ, రవాణా, బీఫ్ అమ్మకాలను క్రమబద్ధీకరించే బిల్లులను ఆమోదించిన సంగతి తెలిసిందే. హిందువులు నివసించే ప్రాంతాల్లో బీఫ్ తినడాన్ని పరిమితం చేసుకోవాలని ఈశాన్య రాష్ట్రాల్లో బీజేపీ కీలక నేత, అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ (Himanta Biswa Sharma) ప్రజలను కోరుతున్నారు.
ఇవి కూడా చదవండి :
UN General Assembly : ఉక్రెయిన్‌పై తీర్మానం... భారత్ కీలక నిర్ణయం...
Updated Date - 2023-02-24T14:21:51+05:30 IST