ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

PM Narendra Modi: మేఘాలయలో సీఎం సంచలన నిర్ణయం... ప్రధాని మోదీ సభకు అనుమతి నిరాకరణ

ABN, First Publish Date - 2023-02-20T11:22:45+05:30

ప్రధానమంత్రి నరేంద్రమోదీ ర్యాలీకి మేఘాలయలో చుక్కెదురైంది....

Meghalaya Denies Permission for Modi Rally
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సౌత్ తురా (మేఘాలయ): ప్రధానమంత్రి నరేంద్రమోదీ ర్యాలీకి మేఘాలయలో చుక్కెదురైంది.(PM Narendra Modi) మేఘాలయలోని స్టేడియంలో ప్రధాని మోదీ బీజేపీ ర్యాలీకి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అనుమతి నిరాకరించిన వ్యవహారం(Denies Permission) సంచలనం రేపింది. ముఖ్యమంత్రి కాన్రాడ్ కె సంగ్మా సొంత నియోజకవర్గమైన సౌత్ తురాలోని పీఏ సంగ్మా స్టేడియంలో(Stadium) ప్రధాని మోదీ ఎన్నికల ర్యాలీని(PM Narendra Modi Rally) నిర్వహించేందుకు బీజేపీకి మేఘాలయ క్రీడా విభాగం అనుమతి నిరాకరించింది.

ఫిబ్రవరి 24వతేదీన షిల్లాంగ్, తురాలో ప్రధాని మోదీఎన్నికల ప్రచారం నిర్వహించాల్సి ఉంది.‘‘స్టేడియంలో ఇంత పెద్ద సమావేశాన్ని నిర్వహించడం సరికాదని మేఘాలయ క్రీడా విభాగం పేర్కొంది,స్టేడియంలో నిర్మాణ పనులు ఇంకా కొనసాగుతున్నందున సైట్‌లో ఉంచిన మెటీరియల్ భద్రత కోసం సభకు అనుమతించడం లేదని జవాబిచ్చారు. అందువల్ల ప్రత్యామ్నాయ వేదిక అలోట్‌గ్రే క్రికెట్ స్టేడియంలో సభ అనుమతి విషయమై పరిశీలిస్తున్నామని జిల్లా ఎన్నికల అధికారి స్వప్నిల్ టెంబే తెలిపారు.127 కోట్లతో నిర్మించిన ఈ స్టేడియాన్ని గతేడాది డిసెంబర్ 16న ముఖ్యమంత్రి ప్రారంభించారు.

ఇది కూడా చదవండి : Coal scam: బొగ్గు స్కాంలో 14 ప్రాంతాల్లో ఈడీ సోదాలు

స్టేడియం ప్రారంభోత్సవం జరిగిన రెండు నెలల తర్వాత ప్రధానమంత్రి ర్యాలీకి స్టేడియం అసంపూర్తిగా ఉందని, అందుబాటులో లేదని ఎలా ప్రకటించగలరని బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారు.‘‘కాన్రాడ్ సంగ్మా,ముకుల్ సంగ్మా మమ్మల్ని చూసి భయపడుతున్నారా? వారు మేఘాలయలో బీజేపీ వేవ్‌ను అరికట్టడానికి ప్రయత్నిస్తున్నారు. మీరు ప్రధానమంత్రి ర్యాలీని ఆపడానికి ప్రయత్నించవచ్చు, కానీ రాష్ట్ర ప్రజలు బీజేపీకి మద్దతు ఇవ్వడానికి నిర్ణయించుకున్నారు’’ అని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రితురాజ్ సిన్హా అన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఇతర బీజేపీ స్టార్ క్యాంపెయినర్ల ర్యాలీలకు ప్రజల స్పందన చూసి ఇతర పార్టీలు అవాక్కయ్యాయని సిన్హా ఆరోపించారు.

Updated Date - 2023-02-20T11:32:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising