ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Rahul Vs Smriti : రాహుల్ గాంధీలో మార్పు : స్మృతి ఇరానీ

ABN, First Publish Date - 2023-03-28T11:32:31+05:30

కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ (Congress MP Rahul Gandhi)కి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi)పై

Rahul Gandhi , Smriti Irani
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

న్యూఢిల్లీ : కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ (Congress MP Rahul Gandhi)కి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi)పై ద్వేషం ఉందని, ఆ విద్వేషం దేశాన్ని ద్వేషించే స్థాయికి మారిందని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ (Union minister Smriti Irani) ఆరోపించారు. దొంగలందరికీ ఇంటి పేరు మోదీ ఎలా అవుతోందని రాహుల్ చేసిన వ్యాఖ్యలు లోక్‌సభ సభ్యత్వాన్ని కోల్పోవడానికి దారి తీసిన సంగతి తెలిసిందే.

స్మృతి ఇరానీ మంగళవారం విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ, ప్రధాని మోదీపై రాహుల్ గాంధీకిగల ద్వేషం రాజకీయ నైరాశ్యం వల్ల యావత్తు దేశాన్ని అవమానించే స్థాయికి చేరిందన్నారు. ప్రధానిని అవమానిస్తూ, యావత్తు ఓబీసీ కమ్యూనిటీని అవమానించడం తెలివైన పని అని ఆయన భావిస్తున్నారన్నారు. ఆయన మోదీని పార్లమెంటులో దూషించారని, మోదీపై ఆరోపణలు చేశారని, అయితే తన సంతకంతో ఉన్న తన సొంత స్టేట్‌మెంట్‌ను సరిచూసుకోలేకపోయారని దుయ్యబట్టారు. ఆయనకు కోర్టు శిక్ష విధించడానికి కారణం కేవలం ఓ వ్యక్తిని దూషించినందుకు కాదని, యావత్తు ఓబీసీ కమ్యూనిటీని దూషించినందుకని, ఈ విషయం దేశంలోని ప్రతి పౌరునికి తెలుసునని అన్నారు.

గాంధీ కుటుంబీకులు దళితులు, వెనుకబడిన వర్గాలకు చెందినవారిని అవమానించే ప్రయత్నం చేయడం ఇదే మొదటిసారి కాదన్నారు. గిరిజన కుటుంబం నుంచి వచ్చిన ఓ మహిళ ద్రౌపది ముర్ము (Droupadi Murmu) మన దేశానికి రాష్ట్రపతి అయినపుడు గాంధీ కుటుంబం ఆదేశాలపై ఓ కాంగ్రెస్ సభ్యుడు ఆమెను అవమానించారన్నారు.

రాహుల్ గాంధీ ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, ప్రధాని మోదీ ప్రతిష్ఠ నాశనమయ్యే వరకు ఆయనపై దాడిని కొనసాగిస్తానని చెప్పారని స్మృతి తెలిపారు. గాంధీ కుటుంబం అధికారంలో ఉన్నపుడు మోదీ ప్రతిష్ఠను మసకబార్చేందుకు చాలా ప్రయత్నాలు చేశారన్నారు. అయితే ఆ ప్రయత్నాలు విఫలమయ్యాయన్నారు. మోదీ పట్ల సామాన్య ప్రజలకు గల ప్రేమను తగ్గించలేకపోయారన్నారు.

కేరళలోని వయనాద్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి రాహుల్ గాంధీ 2019లో గెలిచారు. ఆయన 2019లో కర్ణాటకలో ఓ బహిరంగ సభలో మాట్లాడుతూ, దొంగలందరికీ ఇంటి పేరు మోదీ ఎలా అవుతోందని ప్రశ్నించారు. దీంతో పూర్ణేశ్ మోదీ పరువు నష్టం కేసు దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన సూరత్ కోర్టు రాహుల్ గాంధీ దోషి అని తీర్పు చెప్పింది. ఆయనకు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. దీంతో ఓ న్యాయవాది ఫిర్యాదు మేరకు పార్లమెంటు సచివాలయం ఆయనను లోక్‌సభ సభ్యత్వానికి అనర్హుడిగా ప్రకటించింది.

ఇవి కూడా చదవండి :

Gold and Silver Price : పెరగడమేమో వేలల్లో.. తగ్గితే పైసల్లో..

America : రాహుల్ గాంధీ అనర్హతపై అమెరికా సంచలన వ్యాఖ్యలు

Updated Date - 2023-03-28T11:32:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising