ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Modi and Biden : మోదీ, బైడెన్ టెలిఫోన్ చర్చలు... అత్యంత కీలకాంశం ప్రస్తావన...

ABN, First Publish Date - 2023-02-15T19:44:29+05:30

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi), అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మంగళవారం టెలిఫోన్ ద్వారా చర్చలు జరిపారు.

Narendra Modi, Joe Biden
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi), అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మంగళవారం టెలిఫోన్ ద్వారా చర్చలు జరిపారు. ఇరు దేశాల మధ్య సమగ్ర అంతర్జాతీయ వ్యూహాత్మక భాగస్వామ్యం బలపడుతుండటంపై మోదీ సంతృప్తి వ్యక్తం చేశారు. ఎయిరిండియా-బోయింగ్ మధ్య ఒప్పందం కుదరడం పట్ల ఇరువురు హర్షం ప్రకటించారు.

ఈ ఒప్పందం వల్ల ఉభయ దేశాలకు ప్రయోజనం కలుగుతుందని, అమెరికాలోని 44 రాష్ట్రాల్లో 10 లక్షలకుపైగా ఉద్యోగావకాశాలు లభిస్తాయని బైడెన్ పేర్కొన్నట్లు వైట్ హౌస్ విడుదల చేసిన ప్రకటన పేర్కొంది. అదేవిధంగా భారత దేశంలో వైమానిక రంగంలో పెరుగుతున్న డిమాండ్లను తీర్చేందుకు ఈ ఒప్పందం దోహదపడుతుందని చెప్పినట్లు తెలిపింది.

భారత్-అమెరికా మధ్య స్ట్రాటజిక్ టెక్నాలజీ భాగస్వామ్యం ప్రాధాన్యం గురించి కూడా వీరిరువురూ చర్చించినట్లు తెలిపింది. రెండు వారాల క్రితం వాషింగ్టన్‌లో ప్రారంభించిన క్రిటికల్ అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీ ఇనీషియేటివ్ గురించి కూడా వీరు మాట్లాడినట్లు పేర్కొంది. ఇరు దేశాల ఆర్థికాభివృద్ధికి, పరస్పర ప్రాధాన్యతాంశాల్లో సహకరించుకునేందుకు కలిసికట్టుగా, అదేవిధంగా QUAD వంటి ఇతర గ్రూపులతో కలిసి పని చేయడాన్ని కొనసాగించాలని నిర్ణయించినట్లు తెలిపింది.

220 విమానాలను బోయింగ్ నుంచి కొనేందుకు ఎయిరిండియా ఒప్పందం కుదుర్చుకుందని ఈ ప్రకటన తెలిపింది. ఈ ఒప్పందం విలువ 34 బిలియన్ డాలర్లు అని పేర్కొంది. ఇవి కాకుండా మరొక 70 విమానాలను కొనేందుకు ఈ ఒప్పందాన్ని పొడిగించే అవకాశం కూడా ఉందని, అప్పుడు మొత్తం విలువ 45.9 బిలియన్ డాలర్లు అవుతుందని తెలిపింది.

ప్రధాన మంత్రి కార్యాలయం (PMO) విడుదల చేసిన ప్రకటనలో, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (US President Joe Biden), మోదీ మధ్య ఆత్మీయ సంభాషణ, సత్ఫలితాలు ఇచ్చే సంభాషణ జరిగినట్లు తెలిపింది. ఇరువురు నేతలు ఉభయ దేశాల మధ్య సమగ్ర అంతర్జాతీయ వ్యూహాత్మక భాగస్వామ్యం బలపడటం పట్ల సంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిపింది. సత్సంబంధాలు బలపడటం వల్ల అన్ని రంగాల్లోనూ పటిష్ట వృద్ధి నమోదవుతున్నట్లు పేర్కొంది. ఎయిరిండియా-బోయింగ్ మధ్య కుదిరిన ఒప్పందం పరస్పర ప్రయోజనకరమైన సహకారానికి సుస్పష్టమైన ఉదాహరణ అని ఇరువురు నేతలు పేర్కొన్నట్లు తెలిపింది. దీనివల్ల ఇరు దేశాల్లోనూ నూతన ఉద్యోగావకాశాలు వస్తాయని పేర్కొన్నట్లు తెలిపింది. అంతరిక్షం, సెమీకండక్టర్లు, సప్లయ్ చైన్స్, డిఫెన్స కో-ప్రొడక్షన్, కో-డెవలప్‌మెంట్, నాలెడ్జ్ అండ్ ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్స్ రంగాల్లో ద్వైపాక్షిక సహకారాన్ని పెంచుకోవాలని ఆకాంక్షించినట్లు తెలిపింది.

ఇవి కూడా చదవండి :

Ladakh : దేశ భద్రత కోసం మోదీ మరో కీలక నిర్ణయం

పెళ్లికి ముందే ఎందుకు చెప్పలేదు.. మోసం చేశారంటూ భార్య విడాకుల కేసు.. ఇంతకీ భర్తకు ఉన్న సమస్య ఏంటంటే..


Updated Date - 2023-02-15T19:44:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising