Modi MP Visit: వర్షాల హెచ్చరికతో... ప్రధాని మోదీ పర్యటనలో మార్పులు
ABN, First Publish Date - 2023-06-26T21:20:58+05:30
వర్షాల హెచ్చరికలతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మధ్యప్రదేశ్ పర్యటనలో మార్పులు చోటుచేసుకున్నాయి. షెడ్యూల్ ప్రకారం ఈనెల 27వ తేదీన మధ్యప్రదేశ్‌లోని సహడోల్ లో ప్రధాని పర్యటించాల్సి ఉండగా, ఆ కార్యక్రమం రద్దయింది. అయితే భోపాల్ పర్యటన మాత్రం మంగళవారం యథాప్రకారం జరుగుతుంది.
భోపాల్: వర్షాల హెచ్చరికలతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narnedra Modi) మధ్యప్రదేశ్ (Madhya pradesh) పర్యటనలో మార్పులు చోటుచేసుకున్నాయి. షెడ్యూల్ ప్రకారం ఈనెల 27వ తేదీన మధ్యప్రదేశ్‌లోని సహడోల్ (Shadol)లో ప్రధాని పర్యటించాల్సి ఉండగా, ఆ కార్యక్రమం రద్దయింది. అయితే భోపాల్ పర్యటన మాత్రం మంగళవారం యథాప్రకారం జరుగుతుంది. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈ విషయం తెలియజేశారు.
ప్రధానమంత్రి భోపాల్ పర్యటన సందర్భంగా ఐదు వందే భారత్ రైళ్లను నేరుగా, వర్చువల్ తరహాలో ప్రారంభించనున్నారు. బూత్ స్థాయి బీజేపీ కార్యకర్తల సమావేశంలో కూడా పాల్గొన్నారు. ముందస్తు షెడ్యూల్ ప్రకారం సహడోల్ జిల్లాలోని లాలాపూర్ చేరుకుని నేషనల్ సికిల్ సెల్ అనీమియా ఎలిమినేషన్ మిషన్‌ను ప్రారంభించాల్సి ఉంది. ఆయుష్మాన్ భారత్ ప్రధాన్ మంత్రి జన్ ఆరోగ్య యోజన కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించాల్సి ఉంది. ఇదే కార్యక్రమంలో 16వ శతాబ్దపు వీరయోధురాలు రాణి దుర్గావతి స్మారక కార్యక్రమం కూడా ఉంది.
ఐఎండీ ఆరెంజ్ అలర్ట్...
మధ్యప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో మంగళవారం ఉదయం వరకూ భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని, భారీగా వర్షాపాతం నమోదవుతుందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఐఎండీ హెచ్చరికల నేపథ్యంలో ప్రధానమంత్రి రోడ్‌షో కార్యక్రమం కూడా రద్దయిన పార్టీ నేతలు ప్రకటించారు.
5 వందేభారత్ రైళ్లకు పచ్చజెండా..
కాగా, ప్రధాని భోపాల్ పర్యటన సందర్భంగా రాణి కమలాపతి (భోపాల్)- జబల్‌పూర్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్, ఖజురహో-భోపాల్-ఇండోర్ వందేభారత్ ఎక్స్‌ప్రెస్, మడగావ్ (గోవా)-ముంబై వందే భారత్ ఎక్స్‌ప్రెస్, ధార్వాడ్-బెంగళూరు వందేభారత్ ఎక్స్‌ప్రెస్, హతియా-పాట్నా వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ను అధికారికంగా ప్రారంభించనున్నారు.
Updated Date - 2023-06-26T21:20:58+05:30 IST