ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Parliament : పార్లమెంటు వర్షాకాల సమావేశాలు మరి కాసేపట్లో ప్రారంభం.. మణిపూర్‌పై చర్చకు పట్టుబడుతున్న ప్రతిపక్షాలు..

ABN, First Publish Date - 2023-07-20T10:50:22+05:30

పార్లమెంటు వర్షాకాల సమావేశాలు గురువారం నుంచి ప్రారంభమవుతున్నాయి. ఈ సమావేశాల్లో దాదాపు 30 బిల్లులను ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. అయితే హింసాత్మక సంఘటనలతో అట్టుడుకుతున్న మణిపూర్‌ పరిస్థితిపై చర్చించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.

న్యూఢిల్లీ : పార్లమెంటు వర్షాకాల సమావేశాలు గురువారం నుంచి ప్రారంభమవుతున్నాయి. ఈ సమావేశాల్లో దాదాపు 30 బిల్లులను ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. అయితే హింసాత్మక సంఘటనలతో అట్టుడుకుతున్న మణిపూర్‌ పరిస్థితిపై చర్చించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. పార్లమెంటులో అన్ని కార్యకలాపాలను నిలిపేసి, మణిపూర్‌పై చర్చించాలని కోరుతూ 15 ప్రతిపక్ష పార్టీల ఎంపీలు వాయిదా తీర్మానాన్ని ఇచ్చారు.

ఈ సమావేశాల్లో 31 బిల్లులకు ఆమోదం పొందాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఢిల్లీ రాష్ట్రంలో ప్రభుత్వ అధికారుల నియామకాలు, బదిలీలపై నియంత్రణకు కేంద్ర ప్రభుత్వానికి అధికారం కల్పించే బిల్లు కూడా వీటిలో ఉంది. దీనికి సంబంధించిన ఆర్డినెన్స్ గతంలో జారీ చేసిన సంగతి తెలిసిందే. ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ ఈ బిల్లుకు వ్యతిరేకంగా కాంగ్రెస్ సహా ఇతర ప్రతిపక్ష పార్టీల మద్దతును కోరారు. ఈ నేపథ్యంలో రాజ్యసభలో ఈ బిల్లును ప్రవేశపెట్టినపుడు గందరగోళం ఏర్పడే అవకాశం ఉంది. రాజ్యసభలో ఈ బిల్లును వ్యతిరేకిస్తున్న ఎంపీలు 105 మంది ఉన్నారు. బీజేపీకి కూడా 105 మంది ఎంపీలు మద్దతిస్తున్నప్పటికీ, తెలుగుదేశం పార్టీ, జేడీఎస్, బీఎస్‌పీ, నామినేటెడ్, స్వతంత్ర ఎంపీలు మద్దతిస్తారని ఆశిస్తోంది. వీరి మద్దతుతో ఈ బిల్లుకు ఆమోదం పొందాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఇదిలావుండగా, బీజేడీ, వైకాపా ఈ బిల్లుపై నిర్ణయాన్ని ఇంకా వెల్లడించలేదు.

మెయిటీలు, కుకీల మధ్య ఘర్షణలు ప్రారంభమైన రోజు నుంచి మణిపూర్‌లో ఇంటర్నెట్‌ సేవలను నిలిపేశారు. ఇద్దరు కుకీ మహిళలను కొందరు వ్యక్తులు నగ్నంగా ఊరేగించినట్లు కనిపిస్తున్న ఓ వీడియో బుధవారం బయటపడటంతో అన్ని రాజకీయ పార్టీలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. మణిపూర్ పరిస్థితిపై చర్చించాలని ప్రతిపక్షాలు పట్టుబడుతున్నాయి. టీఎంసీ ఎంపీ డెరెక్ ఒబ్రెయిన్ విడుదల చేసిన ఓ వీడియో సందేశంలో, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మణిపూర్ పరిస్థితిపై మాట్లాడకపోతే, పార్లమెంటులో అంతరాయాలకు ఆయనే బాధ్యత వహించవలసి ఉంటుందన్నారు. ‘మన్ కీ బాత్ ఇక చాలునని, మణిపూర్ గురించి మాట్లాడవలసిన సమయం వచ్చిందని అన్నారు.

కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఇచ్చిన ట్వీట్‌లో, పార్లమెంటులో మణిపూర్ అంశాన్ని లేవనెత్తుతామని చెప్పారు. తాము ఇప్పటికే వాయిదా తీర్మానం ఇచ్చామన్నారు. ప్రధాని మోదీ మణిపూర్ అల్లర్లపై మౌనంగా ఉన్నారని దుయ్యబట్టారు. మోదీకి ఎన్డీయే సమావేశం ఏర్పాటు చేయడానికి సమయం ఉంది కానీ, మణిపూర్ వెళ్లడానికి సమయం లేదా? అని ప్రశ్నించారు. బీజేపీ డెమొక్రసీని మొబొక్రసీగా మార్చిందని మండిపడ్డారు. మణిపూర్‌లో మానవత్వం చచ్చిపోయిందన్నారు. ‘‘నరేంద్ర మోదీ గారూ, మీ మౌనాన్ని ఇండియా ఎన్నటికీ క్షమించదు’’ అని హెచ్చరించారు.

బీఆర్ఎస్ వాయిదా తీర్మానం

మణిపూర్ అంశంపై చర్చించాలని బీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వర రావు, కాంగ్రెస్ ఎంపీ మాణిక్కం ఠాగూర్ లోక్ సభలో వాయిదా తీర్మానాలను ఇచ్చారు.

ఇవి కూడా చదవండి :

Manipur : మణిపూర్‌లో అంతర్యుద్ధం.. భారత్‌ను బీజేపీ ఏ స్థాయికి దిగజార్చింది?.. టీఎంసీ

Manipur : నగ్నంగా మణిపూర్ మహిళల ఊరేగింపు.. వీడియోను తొలగించాలని ట్విటర్‌కు ఆదేశం..

Updated Date - 2023-07-20T10:50:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising