Viral News: గర్భం దాల్చిన పురుషుడు.. కడుపులో ఉన్నది కవల పిల్లలు
ABN, First Publish Date - 2023-06-24T17:34:06+05:30
మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో ఓ పురుషుడు గర్భందాల్చాడు. ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా 36 సంవత్సరాలుగా గర్భంతోనే ఉన్నాడు. మూడున్నర దశాబ్దాల పాటు గర్భంలో ఒకరు కూడా కాదు, ఏకంగా ఇద్దరు కవలలను మోశాడు. 1999లో జరిగిన ఈ ఘటనపై తాజాగా ది డైలీ స్టార్ అనే వార్తా పత్రిక ఒక కథనం ప్రచురించింది.
నాగ్‌పూర్: మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో ఓ పురుషుడు గర్భందాల్చాడు. ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా 36 సంవత్సరాలుగా గర్భంతోనే ఉన్నాడు. మూడున్నర దశాబ్దాల పాటు గర్భంలో ఒకరు కూడా కాదు, ఏకంగా ఇద్దరు కవలలను మోశాడు. 1999లో జరిగిన ఈ ఘటనపై తాజాగా ది డైలీ స్టార్ అనే వార్తా పత్రిక ఒక కథనం ప్రచురించింది. ది డైలీ స్టార్ కథనం ప్రకారం అసలు విషయం ఏమిటంటే.. నాగ్‌పూర్‌లో నివాసం ఉండే భగత్ ఓ మధ్య తరగతి వ్యక్తి. జీవన పోషణ కోసం నిత్యం ఏదో ఒక పనిచేసుకుంటూ ఉండేవాడు. అయితే కొన్నేళ్ల క్రితం భగత్ పొట్ట పెరగడం ప్రారంభమైంది. భగత్ పొట్టను చూసిన ఇరుగుపొరుగు వారు ప్రెగ్నెంట్ అంటూ ఎగతాళి చేసేవారు. కానీ ఆ మాటలను పట్టించుకోని భగత్ తన పని తాను చేసుకునేవాడు. అయితే రోజురోజుకు పొట్ట పెరడంతో అతని రోజు పనులకు ఆటంకం ఏర్పడింది. శ్వాస తీసుకోవడం కూడా కష్టమైపోయింది.
దీంతో 1999లో ముంబైలోని ఓ ఆసుపత్రికి వెళ్లాడు. భగత్ పరిస్థితిని చూసిన డాక్టర్ అజయ్ మెహతా మొదటగా అది ఓ పెద్ద క్యాన్సర్ కణితి అయి ఉంటుందని భావించారు. కానీ ఆపరేషన్ ప్రారంభించిన తర్వాత కడుపులో ఉన్నది చూసి డాక్టర్ అజయ్ మెహతా షాక్‌కి గురయ్యారు. భగత్ కడుపులో మనిషి అవయవాలు ఉండడం చూసి అది కలనా? లేక నిజమా? అని తెలుసుకునేందుకు సదరు డాక్టర్ పక్కన ఉన్నవారితో కరచాలనం చేశారు. వాటిని చూసి భయపడిపోయారు. ఆ తర్వాత ఈ విషయాన్ని ఆ డాక్టరే స్వయంగా చెప్పారు. లోపల చాలా ఎముకలు ఉండడాన్ని గుర్తించానని సదరు డాక్టర్ తెలిపారు. ‘‘కడుపులో నుంచి ఒక అవయవం తర్వాత మరొకటి బయటికొచ్చాయి. జననేంద్రియాలలోని కొన్ని భాగాలు, జుట్టులోని కొన్ని భాగాలు, దవడలు, వెంట్రుకలు వంటి శరీర భాగాలు బయటికి వచ్చాయి. ’’ అని నాటి అనుభవాన్ని సదరు డాక్టర్ పంచుకున్నారు. ప్రస్తుతం భగత్ వయసు 60 సంవత్సరాలు కాగా.. ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నాడు.
36 ఏళ్లపాటు భగత్ తన కవల సోదరుల పిండాన్ని కడుపులో మోశాడని డాక్టర్ అజయ్ తెలిపారు. దీన్నే వైద్య భాషలో ‘‘ఫీటస్ ఇన్ ఫీట్’’ అని అంటారని తెలిపారు. అంటే పిండంపై పిండం పెరగడమని అర్థం. నిజానికి ఇది ఒక అరుదైన వ్యాధి అని, ఒక వైకల్య సకశేరుక పిండం తన కవల సోదరుడి దేహంలో ఉండిపోయిందని తెలిపారు. నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసన్ ప్రకారం ఇటువంటి కేసులు వందకులోపే ఉంటాయని ఆయన చెప్పారు.
Updated Date - 2023-06-24T17:45:37+05:30 IST