Meghalaya: సీఎంగా కాన్రాడ్ సంగ్మా ప్రమాణ స్వీకారం
ABN, First Publish Date - 2023-03-07T12:22:39+05:30
మేఘాలయ కొత్త ముఖ్యమంత్రిగా ఎన్‌పీపీ చీఫ్ కాన్రాడ్ సంగ్మా ప్రమాణస్వీకారం చేశారు. షిల్లాంగ్‌లోని రాజ్‌భవన్‌లో మంగళవారంనాడు..
షిల్లాంగ్: మేఘాలయ (Meghalaya) కొత్త ముఖ్యమంత్రిగా ఎన్‌పీపీ (NPP) చీఫ్ కాన్రాడ్ సంగ్మా (Conrad Sangma) ప్రమాణస్వీకారం చేశారు. షిల్లాంగ్‌లోని రాజ్‌భవన్‌లో మంగళవారంనాడు జరిగిన కొత్త మంత్రివర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌షా, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి జేపీ నడ్డా తదితర ప్రముఖులు హాజరయ్యారు. ఎన్‌సీపీ చీఫ్ కాన్రాడ్ సంగ్మా ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయడం వరుసగా ఇది రెండోసారి. ఎన్‌పీసీ సారథ్యంలోని మేఘాలయ ప్రభుత్వంలో సంగ్మాతో పాటు అలెగ్జాండర్ లలూ హెక్, డాక్టర్ అంపరీన్ లింగ్డో, పాల్ లింగ్డో, కమింగోన్ యంబోన్, షక్లర్ వార్‌గర్, అబు తహెర్ మోండల్, కిరమేన్ షాయలా, ఎంఎన్ మారక్, రక్కమ్ ఎ సంగ్మా మంత్రులుగా, ప్రెస్టోన్ త్సాంసాంగ్, ఎస్.ధర్‌లు ఉప ముఖ్యమంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు.
ఇటీవల జరిగిన మేఘాలయ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్‌పీపీ కూటమి 45 మంది ఎమ్మెల్యేల మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటుకు ముందుగు వచ్చింది. కాన్రాడ్ కె సంగ్మా సారథ్యంలోని ఎన్‌పీపీ 26 సీట్లు గెలుచుకుంది. బీజేపీ 2 సీట్లు గెలుచుకుంది.
కాగా, మంగళవారం కోహిమాలో జరుగనున్న నాగాలాండ్ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కూడా ప్రధాన మంత్రి మోదీ హాజరవుతున్నారు. నేషనల్ డెమక్రటిక్ ప్రొగ్రెసివ్ పార్టీ (NDPP) నేత నెఫియూ రియో (Neiphiu Rio) నాగాలాండ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి కూడా అమిత్‌షా, నడ్డా హాజరవుతున్నారు. నాగాలాండ్‌లో ఎన్‌డీపీపీ, బీజేపీ కూటమి 60 సీట్లకు గాను 37 సీట్లు గెలుచుకుంది. రియో సారథ్యంలో ప్రభుత్వానికి అన్ని ఇతర పార్టీలు మద్దతు ప్రకటించడం విశేషం.
Updated Date - 2023-03-07T12:22:39+05:30 IST