ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Bharat Jodo Yatra : భారత్‌కు ఆశా కిరణం రాహుల్ గాంధీ : మెహబూబా ముఫ్తీ

ABN, First Publish Date - 2023-01-30T14:43:31+05:30

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ (Congress leader Rahul Gandhi)పై పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ (Mehbooba Mufti) ప్రశంసల జల్లు

Bharat Jodo Yatra
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శ్రీనగర్ : కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ (Congress leader Rahul Gandhi)పై పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ (Mehbooba Mufti) ప్రశంసల జల్లు కురిపించారు. భారత్ జోడో యాత్ర (Bharat Jodo Yatra) ముగింపు సభలో సోమవారం ఆమె మాట్లాడుతూ, గాడ్సే భావజాలం లాక్కున్నదాన్ని పునరుద్ధరించాలని గాంధీని కోరారు. ఆయనలో ఓ ఆశా కిరణాన్ని భారత్ చూస్తోందన్నారు.

‘‘రాహుల్! మీ ఇల్లు అయిన కశ్మీరుకు వచ్చానని మీరు అన్నారు. ఇది మీ ఇల్లే. జమ్మూ-కశ్మీరు నుంచి, దేశం నుంచి గాడ్సే భావజాలం లాక్కున్నదానిని పునరుద్ధరిస్తారనే ఆశాభావం నాకు ఉంది. జమ్మూ-కశ్మీరులో ఓ ఆశా కిరణాన్ని చూస్తున్నానని గాంధీజీ గతంలో అన్నారు. నేడు, దేశం రాహుల్ గాంధీలో ఓ ఆశా కరిణాన్ని చూస్తోంది’’ అని మెహబూబా ముఫ్తీ చెప్పారు.

నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా (Omar Abdullah) మాట్లాడుతూ, దేశంలోని పశ్చిమం నుంచి తూర్పునకు మరొక యాత్రను చేపట్టాలని రాహుల్ గాంధీని కోరారు. ఆ యాత్రలో తాను కూడా పాల్గొంటానని తెలిపారు. భారత్ జోడో యాత్ర విజయవంతమైందన్నారు. బీజేపీని ఇష్టపడేవారితోపాటు సోదరభావాన్ని ఇష్టపడేవారు కూడా ఈ దేశంలో ఉన్నారని ఈ యాత్ర వల్ల స్పష్టమైందని తెలిపారు.

ఆర్ఎస్‌పీ నేత ప్రేమ్ చంద్రన్ మాట్లాడుతూ, రాహుల్ గాంధీకి సంఘీభావం తెలిపారు. విభజన శక్తులతో పోరాడగలిగే నేతను తానేనని రాహుల్ రుజువు చేసుకున్నారని తెలిపారు.

భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీ బహిరంగ సభల్లో మాట్లాడటంతోపాటు కార్నర్ మీటింగ్స్, విలేకర్ల సమావేశాలు నిర్వహించారు. గత ఏడాది సెప్టెంబరు 7న తమిళనాడులోని కన్యా కుమారి నుంచి ప్రారంభమైన ఈ యాత్ర కశ్మీరులో ముగిసింది.

Updated Date - 2023-01-30T14:43:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising