Pawar meets Kharge: ఖర్గే, రాహుల్‌ను కలిసిన శరద్ పవార్
ABN, First Publish Date - 2023-10-06T16:00:28+05:30
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ సుప్రీం శరద్ పవార్ శుక్రవారంనాడు న్యూఢిల్లీలోని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేను ఆయన నివాసంలో కలుసుకున్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ కూడా వీరితో చేరారు. వీరి సమావేశం వెనుక కారణం ఏమిటనేది వెంటనే తెలియలేదు.
న్యూఢిల్లీ: నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP) సుప్రీం శరద్ పవార్ (Sharad Pawar) శుక్రవారంనాడు న్యూఢిల్లీలోని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే (Mallikarjun Kharge)ను ఆయన నివాసంలో కలుసుకున్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ కూడా వీరితో చేరారు. వీరి సమావేశం వెనుక కారణం ఏమిటనేది వెంటనే తెలియలేదు. అయితే, ఎన్‌సీపీ పేరు, గుర్తుకు సంబంధించిన అంశంపై ఎన్నికల కమిషన్ ముందు తన వాదన వినిపించేందుక శరద్ పవార్ ఢిల్లీలో ఉన్నారు. అజిత్ పవార్ వర్గం సైతం పార్టీ పేరు, గుర్తును క్లెయిమ్ చేస్తుండటంతో ఆయన వర్గం సైతం ఎన్నికల కమిషన్ ముందు విచారణకు హాజరుకానుంది.
ఇటు శరద్ పవార్, అటు అజిత్ పవార్ తమ వాదనలకు బలం చేకూర్చే డాక్యుమెంట్లను ఈసీఐకి సమర్పించాల్సి ఉంది. ఈ కేసు ఈసీఐ ముందు తొలిసారి విచారణకు వస్తోంది. దీనికి ముందు, ఇరువర్గాలు దాఖలు చేసిన పిటిషన్లపై విచారణకు హజరుకావాలని ఈసీఐ వీరికి నోటీసులు పంపింది. ఇటీవల ఎన్‌సీపీలో తిరుగుబాటు బావుటా ఎగురవేసిన అజిత్ పవార్ తన వర్గానికి చెందిన 8 మంది ఎమ్మెల్యేలతో శివసేన-బీజేపీ సారథ్యంలోని మహారాష్ట్ర ప్రభుత్వంలో చేరారు. ఉపముఖ్యమంత్రిగా అజిత్ పవార్, క్యాబినెట్ మంత్రులుగా ఆయన వర్గం ఎమ్మెల్యేలు ప్రమాణస్వీకారం చేశారు. తమ వెంట 42 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని, తమదే అసలైన ఎన్‌సీపీ అని అజిత్ వర్గం వాదనగా ఉంది. అయితే, ఎన్‌సీపీ వ్యవస్థాపకుడు ఎవరనేది మహారాష్ట్ర ప్రజలకే కాకుండా యవాద్దేశానికి తెలుసనని, పార్టీని వీడిన వారికి పార్టీతో సంబంధం లేదని శరద్ పవార్ తెగేసి చెబుతున్నారు.
Updated Date - 2023-10-06T16:00:28+05:30 IST