ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

NCP Row : అజిత్ పవార్ వెన్నుపోటు?.. శరద్ పవార్ ఘాటు స్పందన..

ABN, First Publish Date - 2023-04-18T14:48:05+05:30

నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP)ని అజిత్ పవార్చీ ల్చబోతున్నట్లు వస్తున్న మీడియా కథనాలపై ఆ పార్టీ చీఫ్ శరద్ పవార్

Ajit Pawar, Sharad Pawar
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP)ని అజిత్ పవార్ (Ajit Pawar) చీల్చబోతున్నట్లు వస్తున్న మీడియా కథనాలపై ఆ పార్టీ చీఫ్ శరద్ పవార్ (Sharad Pawar) మంగళవారం తోసిపుచ్చారు. ఎన్‌సీపీ ఎమ్మెల్యేల సమావేశాన్ని ఎవరూ ఏర్పాటు చేయలేదని స్పష్టం చేశారు. ఎమ్మెల్యేల సమావేశాన్ని తాను ఏర్పాటు చేశానని వచ్చిన వార్తలను అజిత్ పవార్ కూడా ఖండించారు.

అజిత్ పవార్ బీజేపీతో సన్నిహితంగా మెలగుతున్నారని, ఎన్‌సీపీ ఎమ్మెల్యేల్లో మూడింట రెండొంతుల మంది ఆయన వెంట ఉన్నారని మీడియా కథనాలు చెప్తున్న సంగతి తెలిసిందే. మహారాష్ట్ర రాజకీయ వర్గాల్లో కూడా ఈ చర్చ జరుగుతోంది. మహారాష్ట్రలో శివసేన పార్టీ చీలిపోయినట్లుగానే ఎన్‌సీపీ కూడా ముక్కలవుతుందని చాలా మంది భావిస్తున్నారు.

ఈ నేపథ్యంలో శరద్ పవార్ మహారాష్ట్రలోని, పుణే జిల్లా, పురందర్ ప్రాంతంలో విలేకర్లతో మాట్లాడుతూ, మీడియా మదిలో చక్కర్లు కొడుతున్న అంశాలు ‘‘మా మనసుల్లో’’ లేవన్నారు. ఈ చర్చలకు ఎటువంటి ప్రాధాన్యం లేదన్నారు. ఈ కథనాలకు అర్థం లేదన్నారు. పార్టీని ఎలా బలోపేతం చేయాలన్నదాని గురించే తమ ఎమ్మెల్యేలంతా ఆలోచిస్తారని తాను చెప్పగలనని తెలిపారు. ఎవరి మనసులోనూ ఇతర ఆలోచనలేవీ లేవన్నారు.

అంతకుముందు ఓ ప్రముఖ పత్రికలో వచ్చిన కథనం ప్రకారం, అజిత్ పవార్ మహారాష్ట్ర తదుపరి ముఖ్యమంత్రి కావాలని కలలు కంటున్నారు. బీజేపీ మద్దతుతో ఏక్‌నాథ్ షిండే (Eknath Shinde) వారసునిగా ముఖ్యమంత్రి పదవిని చేపట్టేందుకు ఆయన తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు ఈ కథనం తెలిపింది. ఎన్‌సీపీ ఎమ్మెల్యేల మద్దతును ఆయన కూడగడుతున్నారని తెలిపింది.

ఎన్‌సీపీకి ప్రస్తుతం 53 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరిలో సుమారు 40 మంది అజిత్ పవార్ వైపు ఉన్నట్లు ఈ కథనం తెలిపింది. వీరందరూ సంతకాలు చేసిన మద్దతు లేఖను సమయం వచ్చినపుడు గవర్నర్‌కు సమర్పించాలని నిర్ణయించారని తెలిపింది. ఈ వివరాలను ఎన్‌సీపీ ముఖ్య నేతలు చెప్పినట్లు వివరించింది.

2019లో అజిత్ పవార్ తిరుగుబాటు చేసి, బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినపుడు శరద్ పవార్ ఎన్‌సీపీ ఎమ్మెల్యేలకు ఫోన్లు చేసి, పార్టీని ముక్కలు కాకుండా అడ్డుకోగలిగారు. శివసేన (ఉద్ధవ్ బాల్ థాకరే) వర్గం నేత, రాజ్యసభ సభ్యుడు సంజయ్ రౌత్ మాట్లాడుతూ, అజిత్ పవార్ తిరుగుబాటు చేస్తున్నట్లు వచ్చిన వార్తలు నిరాధారమైనవని చెప్పారు. తాను మంగళవారం ఉదయం అజిత్ పవార్‌తోనూ, ఇతర ఎన్‌సీపీ నేతలతోనూ మాట్లాడానని తెలిపారు. మహావికాస్ అగాడీ కూటమిని బలహీనపరచాలనే ఉద్దేశంతోనే ఇటువంటి పుకార్లను ప్రచారం చేస్తున్నారన్నారు. తమను బలహీనపరచగలమనుకోవడం పొరపాటు అని స్పష్టం చేశారు.

ఇవి కూడా చదవండి :

Supreme Court : అతిక్-అష్రఫ్ హత్యలపై విచారణకు సుప్రీంకోర్టు అంగీకారం

Mukul Roy : టీఎంసీ కీలక నేత ముకుల్ రాయ్ ఆచూకీ తెలిసింది

Updated Date - 2023-04-18T14:48:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising