ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

NIA raids: గ్యాంగ్‌స్టర్లు-ఉగ్రవాదుల మధ్య సంబంధాలు...72 ప్రాంతాల్లో ఎన్ఐఏ దాడులు

ABN, First Publish Date - 2023-02-21T09:00:48+05:30

దేశంలో గ్యాంగ్‌స్టర్లు, ఉగ్రవాదులకు మధ్య సంబంధాలున్నాయా? అంటే అవునంటున్నాయి నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ వర్గాలు...

NIA raids
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: దేశంలో గ్యాంగ్‌స్టర్లు, ఉగ్రవాదులకు మధ్య సంబంధాలున్నాయా? అంటే అవునంటున్నాయి నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ(ఎన్ఐఏ) వర్గాలు.(NIA raids) గ్యాంగ్‌స్టర్లు, ఉగ్రవాదులకు మధ్య సంబంధాలపై(Gangster-Terror Nexus) ఎన్ఐఏ మంగళవారం 5రాష్ట్రాల్లోని 72 ప్రాంతాల్లో దాడులు చేశారు. ఉత్తరప్రదేశ్, పంజాబ్, రాజస్థాన్, హర్యానా, ఢిల్లీ ( Uttar Pradesh, Punjab, Rajasthan, Haryana and Delhi-NCR)ప్రాంతాల్లో ఎన్ఐఏ అధికారులు ముమ్మర సోదాలు సాగిస్తున్నారు.

ఇది కూడా చదవండి : Joe Biden:యుద్ధ సమయంలో భారీ భద్రత మధ్య జో బైడెన్ కీవ్‌కు రహస్యంగా ఎలా వెళ్లారంటే... రాత్రివేళ చిన్న విమానంలో, రైలులో పర్యటన

ఫిలిబిత్ కేంద్రంగా అక్రమంగా ఆయుధాలను గ్యాంగ్‌స్టర్లు, ఉగ్రవాదులకు సరఫరా చేస్తున్నారని ఎన్ఐఏ సోదాల్లో తేలింది.(NIA cracks down) అక్రమ ఆయుధాలు పాకిస్థాన్ దేశం నుంచి వచ్చాయని ఎన్ఐఏ అధికారులు వెల్లడించారు. గ్యాంగ్‌స్టర్లు లారెన్స్ బిష్ణోయ్, నీరజ్ బవానాలకు చెందిన ముఠా సభ్యుల నుంచి అక్రమ ఆయుధాలను స్వాధీనం చేసుకొని వారిని ఎన్ఐఏ అధికారులు ప్రశ్నిస్తున్నారు.

ఇది కూడా చదవండి : Turkey earthquake: టర్కీలో మళ్లీ భారీ భూకంపం...ముగ్గురి మృతి, 213 మందికి గాయాలు

పాకిస్థాన్ ఐఎస్ఐ, గ్యాంగ్‌స్టర్లకు మధ్య సంబంధాలున్నాయని ఎన్ఐఏ నాలుగు విడతలుగా జరిపిన దాడుల్లో వెల్లడైంది. గ్యాంగ్‌స్టర్ల నుంచి అక్రమ ఆయుధాలను ఎన్ఐఏ స్వాధీనం చేసుకుంది. గ్యాంగ్‌స్టర్లు, ఉగ్రవాదులు డ్రగ్ ట్రాఫికర్లకు మధ్య సంబంధాలున్నాయని గత ఏడాది అక్టోబరులో ఎన్ఐఏ జరిపిన దాడుల్లో వెలుగుచూసింది.

Updated Date - 2023-02-21T09:21:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising