ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Pakistan minister: పాక్ మంత్రి బిలావల్ భుట్టోకి మన కేంద్రమంత్రి జయశంకర్ స్వాగతం ఎలా చెప్పారంటే...

ABN, First Publish Date - 2023-05-05T11:54:18+05:30

గోవాలోని బెనాలిం గ్రామంలో శుక్రవారం జరుగుతున్న షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్(ఎస్‌సీవో) దేశాల విదేశాంగశాఖ మంత్రుల సమావేశంలో కీలక ఘటన జరిగింది...

Jaishankar greets Pakistan minister Bilawal Bhutto
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బెనాలిం(గోవా): గోవాలోని బెనాలిం గ్రామంలో శుక్రవారం జరుగుతున్న షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్(ఎస్‌సీవో) దేశాల విదేశాంగశాఖ మంత్రుల సమావేశంలో కీలక ఉదంతం జరిగింది. పాక్ మంత్రి బిలావల్ భుట్టో జర్దారీకి(Pakistan minister Bilawal Bhutto) మన దేశ విదేశాంగశాఖ మంత్రి ఎస్ జయశంకర్ షేక్ హ్యాండ్ ఇవ్వకుండా నమస్తేతో స్వాగతం పలికారు.(No shake hand, only Namastey) పాక్ మంత్రికి షేక్ హ్యాండ్ నివారించి భారతీయ సంప్రదాయ పద్ధతిలో ‘‘నమస్తే’ అంటూ స్వాగతం పలికారు.(Jaishankar greets)

ఇది కూడా చదవండి : Former Punjab Assembly Speaker: చరణ్‌జిత్ సింగ్ అత్వాల్ బీజేపీలో చేరిక

పాక్ మంత్రికి విమానాశ్రయంలో భారత రాయబారి జేపీ సింగ్ స్వాగతం పలికారు. ఎస్‌సీవో సదస్సుకు మన దేశ మంత్రి జయశంకర్ ఆహ్వానంపై పాక్ మంత్రి గోవాకు(Goa) వచ్చారు. బిలావల్ భుట్టో జర్దారీ 12 సంవత్సరాల్లో భారతదేశాన్ని సందర్శించిన మొట్టమొదటి పాక్ విదేశాంగ మంత్రిగా నిలిచారు.గోవాలో జరిగే కీలక సమావేశానికి భుట్టో-జర్దారీ వెళ్లే ముందు ఇద్దరూ ఆనందాన్ని పంచుకుంటూ ఫోటోలకు ఫోజులిచ్చారు.

ఇది కూడా చదవండి : Jammu and Kashmir: రాజౌరీలో ఉగ్రవాదుల కోసం భద్రతాదళాల గాలింపు...ఎన్‌కౌంటర్

జమ్మూ కాశ్మీర్‌లో సీమాంతర ఉగ్రవాదంతో సహా అనేక సమస్యలపై రెండు దేశాల మధ్య సంబంధాల్లో కొనసాగుతున్న ఒత్తిడి మధ్య పాక్ మంత్రి భారత్ కు వచ్చారు.గురువారం సాయంత్రం జయశంకర్ విదేశాంగ మంత్రులకు ఏర్పాటు చేసిన రిసెప్షన్‌లో భుట్టో పాల్గొన్నారు.ఎస్‌సీవో విదేశాంగ మంత్రుల సమావేశంలో పాకిస్తాన్ ప్రతినిధి బృందానికి నాయకత్వం వహించడానికి నేను గోవా చేరుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఈ సమావేశం విజయవంతమవుతుందని నేను ఆశిస్తున్నాను’’ అని భుట్టో జర్దారీ విలేకరులతో అన్నారు.

"అస్సలాములైకుమ్, మేం షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (SCO) సమావేశానికి గోవా చేరుకున్నాం."నేను మొదట రష్యా విదేశాంగ మంత్రితో సమావేశం అవుతాను. ఆ తర్వాత ఉజ్బెకిస్తాన్ విదేశాంగ మంత్రితో సమావేశం అవుతాను. విదేశాంగ మంత్రులందరికీ ఇచ్చే విందులో పాల్గొంటాను’’ అని ‘‘సలామ్, ఫ్రమ్ గోవా ఇండియా’’ అనే శీర్షికతో చేసిన ట్వీట్‌లో భుట్టో జర్దారీ పేర్కొన్నారు.

Updated Date - 2023-05-05T11:59:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising