ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Deve Gowda: మోదీని కలవలేదు.. మాకు అధికార దాహం లేదు..!

ABN, First Publish Date - 2023-09-27T16:55:22+05:30

లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకోవాలనే నిర్ణయాన్ని పార్టీ సహచరులందరితోనూ సంప్రదించిన తరువాతే తీసుకున్నట్టు జేడీఎస్ సుప్రీం, మాజీ ప్రధానమంత్రి హెచ్‌డీ దేవెగౌడ చెప్పారు. తమకు ఎలాంటి అధికార దాహం లేదన్నారు. ఈ విషయంలో తాను ప్రధాని మోదీని కలవలేదని చెప్పారు.

బెంగళూరు: రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీతో (BJP) పొత్తు పెట్టుకోవాలనే నిర్ణయాన్ని పార్టీ సహచరులందరితోనూ సంప్రదించిన తరువాతే తీసుకున్నట్టు జేడీఎస్ (JDS) సుప్రీం, మాజీ ప్రధానమంత్రి హెచ్‌డీ దేవెగౌడ (Deve Gowda) చెప్పారు. తమకు ఎలాంటి అధికార దాహం లేదన్నారు. ఈ విషయంలో తాను ప్రధాని మోదీని కలవలేదని, పదేళ్ల తర్వాత మొదటిసారి అమిత్‌షాను కలిశానని బుధవారంనాడిక్కడ మీడియాతో మాట్లాడుతూ ఆయన చెప్పారు.


''బీజేపీతో పొత్తు పెట్టుకునే ముందు మా పార్టీకి చెందిన 19 మంది ఎమ్మెల్యేలు, 8 మంది ఎమ్మెల్సీల అభిప్రాయాలను తీసుకున్నాను. బీజేపీతో అహగాన కుదుర్చుకునే విషయాన్ని పరిశీలించాలని వారంతా చెప్పారు'' అని దేవెగౌడ తెలిపారు. తాము అధికారదాహమున్న రాజకీయనేతలం కాదన్నారు. తాను ప్రధానిని కలవలేదని, అమిత్‌షాను పదేళ్ల తర్వాత తొలిసారి కలిసానని చెప్పారు. కర్ణాటకలో రాజకీయ పరిస్థితి గురించి ఆయనతో చర్చించానని తెలిపారు. కావేరీ జలాల పంపిణీ అంశంపై మాట్లాడూతూ, కర్ణాటక ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాజీ సీఎం బీఎస్ యడియూరప్ప బెంగళూరులో జరుపనున్న బైఠాయింపు నిరసనలో హెచ్‌డీ కుమారస్వామి పాల్గొంటారని చెప్పారు.


బీజేపీ సారథ్యంలోని ఎన్డీయేతో జేడీఎస్ సెప్టెంబర్ 22న జతకట్టింది. 2024 లోక్‌సభ ఎన్నికల్లో కర్ణాటకలోని అధికార కాంగ్రెస్‌పై కలిసికట్టుగా పోరాడాలని రెండుపార్టీలు నిర్ణయించాయి. పొత్తు విషయాన్ని అమిత్‌షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో సమావేశమైన అనంతరం కర్ణాటక మాజీ సీఎం, జేడీఎస్ నేత హెచ్‌డీ కుమారస్వామి ఇటీవల ప్రకటించారు. దసరా తర్వాత సీట్ల పంపకాలకు సంబంధించి మరిన్ని చర్చలు జరుపుతామని తెలిపారు. కాగా, బీజేపీతో జేడీఎస్‌ పొత్తు పెట్టుకోవడంపై నిరసన తెలుపుతూ కర్ణాటక జేడీఎస్ ఉపాధ్యక్షుడు సైయద్ సైఫుల్లా సెహెబ్, ఇతర నేతలు ఎం.శ్రీకాంత్, యూడీ అయేషా పర్జానా తదితరులు ఇటీవల జేడీఎస్‌కు రాజీనామా చేశారు.

Updated Date - 2023-09-27T16:55:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising