ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Odisha train accident : ఒడిశా రైలు ప్రమాద స్థలానికి మోదీ!

ABN, First Publish Date - 2023-06-03T11:30:49+05:30

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శనివారం ఒడిశాలోని బాలాసోర్‌లో పర్యటించబోతున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) శనివారం ఒడిశాలోని బాలాసోర్‌లో పర్యటించబోతున్నారు. బహనాగా బజార్ స్టేషన్ సమీపంలో శుక్రవారం సాయంత్రం 6.55 గంటల నుంచి 7 గంటల మధ్యలో మూడు రైళ్లు ప్రమాదానికి గురైన నేపథ్యంలో పరిస్థితిని స్వయంగా సమీక్షించబోతున్నారు. అంతకుముందు ఆయన ఈ దుర్ఘటనపై ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు.

ఒడిశాలోని బాలాసోర్ జిల్లా, బహనాగా బజార్ స్టేషన్ సమీపంలో శుక్రవారం సాయంత్రం 6.55 గంటల నుంచి 7 గంటల మధ్యలో ఈ దారుణం జరిగింది. బెంగళూరు-హౌరా సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ మొదట పట్టాలు తప్పినట్లు తెలుస్తోంది. ఈ రైలు బోగీలు పక్కనే ఉన్న పట్టాలపై పడ్డాయని, ఆ తర్వాత షాలిమార్-చెన్నై కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పి, బెంగళూరు-హౌరా సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌పై పడిందని, అంతేకాకుండా ఆ పక్కనే పార్క్ చేసి ఉన్న ఓ గూడ్స్ రైలుపై పడిందని తెలుస్తోంది. ఇదంతా కేవలం 5 నిమిషాల వ్యవధిలోనే జరిగిందని చెప్తున్నారు. కోల్‌కతాకు దక్షిణ దిశలో 250 కిలోమీటర్ల దూరంలో, భువనేశ్వర్‌కు ఉత్తర దిశలో 170 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రమాదం జరిగింది. కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పడానికి కారణాలేమిటో ఇంత వరకు తెలియడం లేదు.

రైలు ప్రమాదంపై సమీక్షించేందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శనివారం ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఆయన పరిస్థితిని స్వయంగా సమీక్షించేందుకు, సహాయ కార్యకలాపాలను పర్యవేక్షించేందుకు శనివారం ఈ ప్రమాద స్థలానికి చేరుకోబోతున్నట్లు తెలిపాయి. మొదట ప్రమాద స్థలాన్ని సందర్శించి, ఆ తర్వాత కటక్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నవారిని పరామర్శిస్తారని వెల్లడించాయి.

ఇదిలావుండగా, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ బాలాసోర్ మెడికల్ కళాశాల, ఆసుపత్రిలో బాధితులను పరామర్శించారు. రైల్వే బోర్డు ఇన్ఫర్మేషన్ పబ్లికేషన్ విభాగం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అమితాబ్ శర్మ మీడియాతో మాట్లాడుతూ, ఇప్పటి వరకు దాదాపు 100 మందికిపైగా నష్టపరిహారం కోరినట్లు తెలిపారు. నష్టపరిహారం చెల్లింపు కోసం బాలాసోర్, సోరో, బహనాగ బజార్ స్టేషన్లలో కౌంటర్లను ఏర్పాటు చేశామన్నారు. 48 రైళ్ల రాకపోకలను రద్దు చేసినట్లు, 39 రైళ్లను దారి మళ్లించినట్లు, 10 రైళ్లను కుదించినట్లు తెలిపారు. ఈ ప్రమాదంలో 238 మంది మరణించారని, 600 మందికిపైగా గాయపడ్డారని తెలిపారు.

ఇవి కూడా చదవండి :

Odisha Train Accidnt : రైలు ప్రమాదం కారణంగా నేడు, రేపు రద్దైన రైళ్లు ఏవంటే...

Odisha Train Accident : అత్యంత విషాదకర రైలు ప్రమాదం.. సంతాప దినాలు ప్రకటించిన తమిళనాడు, ఒడిశా ప్రభుత్వాలు..

Updated Date - 2023-06-03T11:30:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising