ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Manipur : మణిపూర్ బయల్దేరిన ప్రతిపక్ష ఇండియా కూటమి ఎంపీలు

ABN, First Publish Date - 2023-07-29T09:47:10+05:30

హింసాత్మక ఘర్షణలతో అట్టుడికిన మణిపూర్‌ రాష్ట్రంలో పరిస్థితులను పరిశీలించేందుకు ప్రతిపక్ష ఇండియా (I.N.D.I.A) కూటమి ఎంపీలు బయల్దేరారు. వీరు శని, ఆదివారాల్లో ఈ రాష్ట్రంలో పర్యటించి, ప్రజల పరిస్థితిని సమీక్షిస్తారు. కుకీలు, మెయిటీల మధ్య ఘర్షణలను పరిష్కరించేందుకు ప్రభుత్వానికి, పార్లమెంటుకు సిఫారసులు చేస్తారు.

న్యూఢిల్లీ : హింసాత్మక ఘర్షణలతో అట్టుడికిన మణిపూర్‌ రాష్ట్రంలో పరిస్థితులను పరిశీలించేందుకు ప్రతిపక్ష ఇండియా (I.N.D.I.A) కూటమి ఎంపీలు బయల్దేరారు. వీరు శని, ఆదివారాల్లో ఈ రాష్ట్రంలో పర్యటించి, ప్రజల పరిస్థితిని సమీక్షిస్తారు. కుకీలు, మెయిటీల మధ్య ఘర్షణలను పరిష్కరించేందుకు ప్రభుత్వానికి, పార్లమెంటుకు సిఫారసులు చేస్తారు. మే 3 నుంచి ఈ తెగల మధ్య జరుగుతున్న ఘర్షణల్లో దాదాపు 150 మంది ప్రాణాలు కోల్పోగా, సుమారు 50 వేల మంది నిరాశ్రయులయ్యారు.

కాంగ్రెస్ రాజ్య సభ సభ్యుడు నసీర్ హుస్సేన్ ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో తెలిపిన వివరాల ప్రకారం, 20 రాజకీయ పార్టీలకు చెందిన ఎంపీలు ఈ పర్యటనలో పాల్గొన్నారు. వీరు ఢిల్లీ విమానాశ్రయం నుంచి శనివారం ఉదయం బయల్దేరారు. వీరు మణిపూర్ లోయ, కొండ ప్రాంతాల్లో పర్యటిస్తారు. వీరు ఆదివారం మణిపూర్ గవర్నర్ అనుసూయియా వుయ్కీని కలుస్తారు.


కాంగ్రెస్ ఎంపీ అధిర్ రంజన్ చౌదరి శనివారం మాట్లాడుతూ, మణిపూర్ సమస్యపై రాజకీయాలు చేయవద్దని కోరారు. ఇప్పటి వరకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ రాష్ట్రంలో పర్యటించే ప్రయత్నమే చేయలేదన్నారు. నేడు ప్రతిపక్షాల నుంచి వచ్చిన కుదుపు వల్ల కేంద్ర ప్రభుత్వం మేలుకుందని చెప్పారు.

మణిపూర్ వెళ్తున్న బృందంలోని శివసేన (యూబీటీ) ఎంపీ అరవింద్ సావంత్ శనివారం మాట్లాడుతూ, మణిపూర్ 75 రోజులుగా తగులబడుతోందన్నారు. మహిళలపై దురాగతాలు, మరణాలు దేశ ప్రతిష్ఠను దెబ్బతీస్తాయన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ఏదో ఓ చర్య చేపట్టి ఉండవలసిందన్నారు.

ఈ బృందంలోని జేడీయూ ఎంపీ రాజీవ్ రంజన్ సింగ్ మాట్లాడుతూ, మణిపూర్ ప్రజలను తాము కలుస్తామన్నారు. కొన్ని నెలలుగా రాష్ట్రం తగులబడుతోందన్నారు. అక్కడ శాంతిని పునరుద్ధరించాలన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్ని సమస్యలపైనా మాట్లాడుతున్నారు కానీ మణిపూర్ గురించి మాత్రం నోరు మెదపడం లేదన్నారు. మణిపూర్‌లో శాంతియుత పరిస్థితులు నెలకొనాలని తాము కోరుకుంటున్నామని, మోదీ పార్లమెంటులో ఇంకా మాట్లాడటం లేదని అన్నారు.


జేఎంఎం ఎంపీ మహువా మాజి మాట్లాడుతూ, మణిపూర్‌లో ప్రజలు ఇప్పటికీ సహాయక శిబిరాల్లో ఉంటున్నారంటే, శాంతియుత పరిస్థితులు నెలకొన్నాయని ఎలా చెప్పగలమని ప్రశ్నించారు. ఆర్జేడీ ఎంపీ మనోజ్ ఝా మాట్లాడుతూ, మణిపూర్ ప్రజల మాటలను వినాలన్నారు. తాము వారి మాటలను విని, వారి పరిస్థితులను అర్థం చేసుకుంటామని చెప్పారు. అన్ని తెగల ప్రజల మాటలను వినేందుకు ప్రయత్నిస్తామన్నారు. అదొక్కటే తమ లక్ష్యమని తెలిపారు. డీఎంకే ఎంపీ కనిమొళి మాట్లాడుతూ, తాము మణిపూర్ ప్రజలకు సంఘీభావం తెలపడానికి వెళ్తున్నామన్నారు. వారి కోసం పోరాడుతున్నట్లు చెప్పడానికి వెళ్తున్నామని తెలిపారు. మణిపూర్ గవర్నర్‌ను కలిసేందుకు అనుమతి కోరినట్లు తెలిపారు. అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా మోదీ పార్లమెంటులో ఈ విషయాలపై మాట్లాడతారని భావిస్తున్నామన్నారు.

ప్రతిపక్ష ఎంపీల పర్యటనపై బీజేపీ స్పందిస్తూ, మణిపూర్‌లో సమస్యను మరింత రెచ్చగొట్టడం మానుకోవాలని కోరింది. ఇదిలావుండగా, కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా సమర్పించిన అవిశ్వాస తీర్మానంపై చర్చకు లోక్ సభ సభాపతి అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. మణిపూర్ సమస్యపై చర్చించాలనే లక్ష్యంతో ఈ అవిశ్వాస తీర్మానాన్ని ప్రతిపక్ష ఇండియా కూటమి సమర్పించింది.


ఇవి కూడా చదవండి :

Chennai: బోసినవ్వుల బామ్మ ఇకలేరు

Chennai: మణిపూర్‌ హింసలో అన్నీ కోల్పోయాం...

Updated Date - 2023-07-29T09:47:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising