ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Modi and America : రష్యా-ఉక్రెయిన్ యుద్ధం... మోదీ నచ్చజెప్పగలరు : అమెరికా

ABN, First Publish Date - 2023-02-11T11:10:28+05:30

రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధానికి ముగింపు పలకడానికి దారి తీసే ఎటువంటి కృషినైనా అమెరికా స్వాగతిస్తుందని శ్వేత సౌధం

Narendra Modi, Vladimir Putin
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వాషింగ్టన్ : రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధానికి ముగింపు పలకడానికి దారి తీసే ఎటువంటి కృషినైనా అమెరికా స్వాగతిస్తుందని శ్వేత సౌధం (White House) అధికార ప్రతినిధి జాన్ కిర్బీ (John Kirby) చెప్పారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) ఈ రెండు దేశాల మధ్య యుద్ధాన్ని ఆపడంలో, రష్యా అధ్యక్షుడు వ్లదిమిర్ పుతిన్ (Vladimir Putin)కు నచ్చజెప్పడంలో ఆలస్యం జరిగిందా? అనే ప్రశ్నకు కిర్బీ ఈ విధంగా స్పందించారు. కిర్బీ వైట్ హౌస్ జాతీయ భద్రతా మండలి అధికార ప్రతినిధి.

‘‘ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఎటువంటి ప్రయత్నాలు చేయాలనుకుంటున్నారో చెప్పడాన్ని స్వాగతిస్తాను. యుద్ధాన్ని ఆపడానికి పుతిన్‌కు ఇప్పటికీ సమయం ఉందని భావిస్తున్నాను. అందుకు ఇప్పటికీ సమయం ఉందనుకుంటున్నాను. పీఎం మోదీ నచ్చజెప్పగలరు; ఎటువంటి చర్యలు చేపట్టాలనుకుంటున్నారో మోదీ చెప్పాలి. ఉక్రెయిన్‌లో యుద్ధానికి తెరపడటానికి దారి తీసే ఎటువంటి కృషినైనా అమెరికా స్వాగతిస్తుంది. యుద్ధం ఈరోజే ఆగిపోతుందని అనుకుంటున్నాం. ఈ రోజే ఆగిపోవాలి’’ అని జాన్ కిర్బీ అన్నారు.

ఉక్రెయిన్ ప్రజల కష్టాలకు ఏకైక కారణం వ్లదిమిర్ పుతిన్ అని జాన్ కిర్బీ ఆరోపించారు. పుతిన్ ఈ యుద్ధాన్ని ఇప్పటికిప్పుడు ఆపగలరన్నారు. అందుకు బదులుగా ఆయన ఇంధనం, విద్యుత్తు మౌలిక సదుపాయాల కంపెనీలపై క్రూయిజ్ క్షిపణులతో విరుచుకుపడుతున్నారన్నారు. దీపాలను ఆర్పేయడానికి, ఉక్రెయినియన్లు ఇప్పటికే అనుభవిస్తున్నదానికన్నా ఎక్కువ కష్టాలు అనుభవించేలా చేయడానికి పుతిన్ ప్రయత్నిస్తున్నారన్నారు. చర్చలకు ఇదే సరైన సమయమని ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్‌స్కీ (Volodymyr Zelenskyy) నిర్ణయించుకుంటే, అటువంటి నిర్ణయం తీసుకోగలిగినది ఆయన మాత్రమే, ఆయన సాధ్యమైనంత బలమైన చేయూతతో ఆ పని చేయాలన్నారు.

మన దేశ జాతీయ భద్రతా సలహాదారు (NSA) అజిత దోవల్ (Ajit Doval) గురువారం వ్లదిమిర్ పుతిన్‌తో మాస్కోలో చర్చలు జరిపారు. ఈ నేపథ్యంలో అమెరికా స్పందనకు చాలా ప్రాధాన్యం ఉంది.

ఇదిలావుండగా, ప్రధాని మోదీ ఇప్పటికే చాలాసార్లు పుతిన్, జెలెన్‌స్కీలతో మాట్లాడారు. ఉబ్జెకిస్థాన్‌లోని సమర్ఖండ్‌లో షాంఘై సహకార సంఘం సమావేశాలకు పుతిన్, మోదీ హాజరయ్యారు. ఈ సందర్భంగా పుతిన్‌తో మోదీ మాట్లాడుతూ, ఇది యుద్ధాలు చేసే కాలం కాదని చెప్పారు. ప్రజాస్వామ్యం, దౌత్యం, చర్చలు యావత్తు ప్రపంచాన్ని స్పృశిస్తాయన్నారు. ఈ విషయాన్ని ఫోన్ సంభాషణల సమయంలో చాలాసార్లు ప్రస్తావించానని తెలిపారు. తక్షణమే యుద్ధాన్ని ఆపాలని మోదీ ఇచ్చిన సందేశాన్ని అమెరికా, యూరోపు దేశాలు స్వాగతించాయి.

ప్రధాన మంత్రి కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపిన వివరాల ప్రకారం, జెలెన్‌స్కీ గత ఏడాది డిసెంబరులో మోదీకి ఫోన్ చేశారు. శాంతి కోసం 10 అంశాలతో కూడిన ప్రణాళిక గురించి ప్రస్తావించారు. ఘర్షణలను తక్షణమే ఆపాలని మోదీ పిలుపునిచ్చారు. శాశ్వతంగా నిలిచే పరిష్కారం కోసం చర్చలు, దౌత్యమార్గాలను అనుసరించాలని కోరారు.

Updated Date - 2023-02-11T11:10:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising