ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Vande Bharat Train : వందే భారత్ రైళ్లపై మోదీ వ్యాఖ్యలు

ABN, First Publish Date - 2023-04-01T17:59:03+05:30

గత ప్రభుత్వాల హయాంలో కేవలం ఒక కుటుంబాన్ని మాత్రమే భారత దేశపు ప్రథమ కుటుంబంగా భావించేవారని ప్రధాన మంత్రి

Narendra Modi, Vande Bharat Train
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

భోపాల్ : గత ప్రభుత్వాల హయాంలో కేవలం ఒక కుటుంబాన్ని మాత్రమే భారత దేశపు ప్రథమ కుటుంబంగా భావించేవారని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) దుయ్యబట్టారు. దేశంలోని మధ్య తరగతి కుటుంబాల అవసరాలను పట్టించుకునేవారు కాదని మండిపడ్డారు. భారతీయ రైల్వేలు (Indian Railways) సామాన్యులకు అందుబాటులో ఉంటాయన్నారు. గడచిన తొమ్మిదేళ్ళ నుంచి తన ప్రభుత్వం భారతీయ రైల్వేలను ప్రపంచంలోనే అత్యుత్తమంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. భోపాల్-న్యూఢిల్లీ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు (Bhopal-New Delhi Vande Bharat Express train)ను శనివారం ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడారు.

వందే భారత్ రైలు భారత దేశంలో సరికొత్త పరిణామానికి చిహ్నమని మోదీ చెప్పారు. దేశంలోని అన్ని వైపుల నుంచి ఈ రైళ్లకు డిమాండ్ ఉందన్నారు. ఈ రైళ్లు సూపర్‌హిట్ అయ్యాయన్నారు. దేశంలోని 900 రైల్వే స్టేషన్లలో సీసీటీవీలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రైలు ప్రయాణం ఇప్పుడు సురక్షితంగా మారిందని చెప్పారు. రైళ్లు పరిశుభ్రంగా ఉంటున్నాయని, సకాలంలో నడుస్తున్నాయని తెలిపారు. ఈ కొత్త వందే భారత్ రైళ్లు నూతన ఉద్యోగావకాశాలను, అభివృద్ధిని తీసుకొస్తాయని చెప్పారు. గతంలో మధ్య ప్రదేశ్‌ రైల్వేలకు కేవలం రూ.600 కోట్లు మాత్రమే బడ్జెట్‌లో కేటాయించారని, ఇప్పుడు రూ.13,000 కోట్లు కేటాయించామని చెప్పారు. మధ్య ప్రదేశ్ పాత రోజులను వెనుకకు నెట్టి, నూతన అభివృద్ధి దిశగా దూసుకెళ్తోందన్నారు.

భోపాల్-న్యూఢిల్లీ మధ్య నడిచే ఈ రైలును రాణి కమలపతి స్టేషన్‌లో మోదీ శనివారం ప్రారంభించారు. ఇది 708 కిలోమీటర్ల దూరం 7 గంటల 45 నిమిషాల్లో ప్రయాణిస్తుంది. ఇది దేశంలో 11వ వందే భారత్ రైలు.

మధ్య ప్రదేశ్ శాసన సభ ఎన్నికలు ఈ ఏడాది చివర్లో జరుగుతాయి. మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని బీజేపీ ప్రయత్నిస్తోంది. ప్రభుత్వ వ్యతిరేకతపై కాంగ్రెస్ ఆశలు పెట్టుకుంది.

ఇవి కూడా చదవండి :

Hindus in danger : బీజేపీ ఆరోపణలపై మహువా మొయిత్రా మండిపాటు

IndiGo : ఇండిగో సిబ్బందిపై దాడి.. స్వీడిష్ జాతీయుడి అరెస్ట్..

Updated Date - 2023-04-01T17:59:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising