ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Modi America Tour: ఉక్రెయిన్‌లో శాంతి పునరుద్దరణకు భారత్ సిద్ధం: ప్రధాని మోదీ

ABN, First Publish Date - 2023-06-23T13:42:33+05:30

ఉక్రెయిన్‌లో శాంతిని నెలకొల్పేందుకు ఏ విధమైన సహకారం అందించేందుకైనా భారత్ సిద్ధంగా ఉందని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. చర్చలు, దౌత్యం తద్వారా వివాదాన్ని పరిష్కరించేందుకు న్యూఢిల్లీ ఎప్పుడు అనుకూలంగానే ఉంటుందని ప్రధాని మోదీ చెప్పారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: ఉక్రెయిన్‌లో(Ukraine) శాంతిని నెలకొల్పేందుకు ఏ విధమైన సహకారం అందించేందుకైనా భారత్ సిద్ధంగా ఉందని ప్రధాని మోదీ(PM Modi)స్పష్టం చేశారు. చర్చలు, దౌత్యం తద్వారా వివాదాన్ని పరిష్కరించేందుకు న్యూఢిల్లీ ఎప్పుడు అనుకూలంగానే ఉంటుందని ప్రధాని చెప్పారు. అమెరికా అధ్యక్షుడు బైడెన్‌తో (America President Joe Biden) చర్చల అనంతరం సంయుక్త విలేకరుల సమావేశంలో నరేంద్రమోదీ ఈ వ్యాఖ్యలు చేశారు.

ఉక్రెయిన్‌లో యుద్ధం ప్రారంభం నుంచి చర్చలు, దౌత్యం ద్వారా వివాద పరిష్కారానికి భారత్ ప్రాధాన్యనిస్తోందని, ఉక్రెయిన్‌లో శాంతి పునరుద్ధరణకు మేం చేయగలిగిన సహకారం అందిస్తామని ప్రధాని పేర్కొన్నారు. ఒకే భూమి, ఒకే కుటుంబం, ఒకే భవిష్యత్తు స్ఫూర్తిని కొనసాగిస్తామని మోదీ అన్నారు.

మరోవైపు అభివృద్ధి చెందుతున్న దేశాలలో యుద్ధం పరిణామాలను తగ్గించేందుకు మరింత కృషి చేయాలని ఇరు దేశాల నేతలు పిలుపునిచ్చారు. ఉక్రెయిన్ ప్రజలకు నిరంతరం మానవతా సహాయం అందిస్తామని రెండు దేశాలు ప్రతిజ్ఞ చేశాయి. అంతర్జాతీయ చట్టం, UN చార్టర్ సూత్రాలు, ప్రాదేశిక సమగ్రత, సార్వభౌమత్వాన్ని గౌరవించాలని పిలుపునిచ్చారు. ఉక్రెయిన్‌లో సంఘర్షణ అనంతర పునర్నిర్మాణం ప్రాముఖ్యతపై రెండు దేశాలు ఏకీభవించాయి.

Updated Date - 2023-06-23T13:50:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising