ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

PM Modi US Tour: ముగిసిన ప్రధాని మోదీ అమెరికా పర్యటన..అగ్రరాజ్యంతో కీలక ఒప్పందాలు

ABN, First Publish Date - 2023-06-24T08:09:05+05:30

ప్రధాని మోదీ అమెరికా పర్యటన(US Tour) ముగించు కొని ఈజిప్టుకు బయల్దేరారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: ప్రధాని మోదీ(PM Modi) అమెరికా పర్యటన(US Tour) ముగించు కొని ఈజిప్టుకు(Egypt ) బయల్దేరారు. చారిత్రక అమెరికా పర్యటనలో అధ్యక్షుడు జో బైడెన్‌తో(Joe Biden) కీలక చర్చలు, ప్రవాస భారతీయులు, వ్యాపారవేత్తలతో సమావేశాలతో మూడు రోజుల పాటు బిజీబిజీగా ప్రధాని మోదీ గడిపారు. బైడెన్ దంపతులు(joe Biden, Jill Biden), ఉపాధ్యక్షురాలు కమలా హారీస్(Vice President) ఇచ్చిన విందుతో అమెరికా పర్యటన ముగించుకొని విదేశీ పర్యటనలో భాగంగా ప్రధాన మోదీ ఈజిప్టు బయల్దేరారు.

కాగా..ప్రధాని మోదీ ఈజిప్టులో పర్యటించడం ఇదే తొలిసారి. 1997 తర్వాత ఈజిప్టులో పర్యటిస్తున్న తొలి ప్రధాని నరేంద్ర మోదీ. ఈజిప్టు అధ్యక్షుడు అబ్దుల్ ఫతేహ్ ఎల్ సీసీ ఆహ్వానం మేరకు ప్రధాని మోదీ ఈజిప్టులో పర్యటిస్తున్నారు.

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ప్రథమ మహిళ జిల్ బైడెన్ ఆహ్వానం మేరకు జూన్ 21న న్యూయార్క్ చేరుకోవడంతో మోదీ అమెరికా పర్యటన ప్రారంభమైది. ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో చారిత్రక కార్యక్రమం వరల్డ్ యోగా డేకు ప్రధాని నాయకత్వం వహించారు. ఆ తర్వాత వాషింగ్టన్ డీసీలోని వైట్ హౌజ్ ప్రధాని మోదీకి రెడ్ కార్పెట్‌తో స్వాగతం పలికింది.

పర్యటనలో భాగంగా.. ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ గురువారం చారిత్రక శిఖరాగ్ర సమావేశం నిర్వహించారు. ఆ తర్వాత అమెరికా కాంగ్రస్‌లో మోదీ ప్రసంగం ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. అనంతరం ప్రధాని మోదీ గౌరవార్థం వైట్ హౌజ్‌లో బైడెన్ దంపతులు స్టేట్ డిన్నర్ ఇచ్చారు.

ఈ పర్యటనలో ఇరుదేశాల మధ్య కీలక ఒప్పందాలు జరిగాయి. రక్షణ, వాణిజ్యం వంటి కీలక రంగాల్లో సహకారం పెంపొందించుకునేందుకు కీలక ఒప్పందాలు చేసుకున్నారు. మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్‌లు, యూఎస్ డ్రోన్ వ్యవస్థను బలోపేతం చేసేందుకు భారత్‌లో జెట్ ఇంజిన్లను సంయుక్తంగా ఉత్పత్తి చేసేందుకు ఒప్పందం జరిగింది.

భారత్, అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్యం పెంపొందించుకునేందుకు ఇరు దేశాలు సుముఖంగా ఉండటంతో భారత వైమానిక దళంలో లైట్ కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్((LCA)-Mk-II) తేజస్ కోసం ఫైటర్ జెట్ ఇంజిన్లను ఉత్పతి చేసేందుకు GE ఎరోస్పేస్, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్(HAL)తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు ప్రకటించింది. కంప్యూటరైజ్డ్ స్టోరేజ్ చిప్ప్ తయారీ సంస్థ ‘మైక్రాన్’ కూడా గుజరాత్‌లో సెమీకండక్టర్ అసెంబ్లింగ్ ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది.

కాగా..అమెరికా కాంగ్రెస్‌లో రెండుసార్లు ప్రసంగించిన తొలి ప్రధాని మోదీ కావడం విశేషం. ఉగ్రవాదం ప్రోత్సహిస్తున్న ప్రభుత్వాలపై చర్యలు తీసుకునేందుకు కలిసి రావాలని కోరారు.

Updated Date - 2023-06-24T08:12:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising