ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Budget 2023 : కేంద్ర బడ్జెట్ గుట్టు విప్పిన మోదీ

ABN, First Publish Date - 2023-01-31T13:20:00+05:30

మన దేశ బడ్జెట్‌పై యావత్తు ప్రపంచం దృష్టి సారించిందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) చెప్పారు.

Narendra Modi
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : మన దేశ బడ్జెట్‌పై యావత్తు ప్రపంచం దృష్టి సారించిందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) చెప్పారు. ప్రపంచంలో నేడు ఉన్న పరిస్థితుల నేపథ్యంలో, భారత దేశ బడ్జెట్ గురించి తెలుసుకోవాలని మన దేశవాసులే కాకుండా, యావత్తు ప్రపంచం ఎదురు చూస్తోందని చెప్పారు. పార్లమెంటు బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడారు.

అంతర్జాతీయంగా ఆర్థిక పరిస్థితులు అస్థిరంగా ఉన్నాయని, అయినప్పటికీ మన దేశ బడ్జెట్ సామాన్యుల ఆశలు, ఆకాంక్షలను నెరవేర్చేందుకు ప్రయత్నిస్తుందని తెలిపారు. సామాన్యుల ఆశలు, ఆకాంక్షలను నెరవేర్చేందుకు ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ (Nirmala Sitharaman) అన్ని విధాలుగా కృషి చేస్తారని తాను బలంగా నమ్ముతున్నానని తెలిపారు.

‘భారత దేశానికి పెద్ద పీట, ప్రజలకు పెద్ద పీట’ అనే భావాన్ని స్వీకరించి తాము ఈ బడ్జెట్ సమావేశాలను నిర్వహిస్తామని తెలిపారు. ప్రతిపక్ష సభ్యులు తమ అభిప్రాయాలను పార్లమెంటు ముందు ఉంచుతారని ఆశిస్తున్నానన్నారు.

ఆర్థిక రంగంలో గుర్తింపు పొందిన నిపుణుల నుంచి మన దేశం కోసం సకారాత్మక (Positive) సందేశాలు వస్తున్నాయన్నారు. పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించడం గర్వకారణమని తెలిపారు.

Updated Date - 2023-01-31T14:37:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising