ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

SCO Summit : ద్వంద్వ ప్రమాణాలొద్దు.. పాక్, చైనాలకు తెగేసి చెప్పిన మోదీ..

ABN, First Publish Date - 2023-07-04T15:56:33+05:30

ఉగ్రవాదంపై ద్వంద్వ ప్రమాణాలను పాటిస్తున్న పాకిస్థాన్, చైనాలను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) కడిగిపారేశారు. ప్రపంచ శాంతికి ఉగ్రవాదం పెను ముప్పు అని, దీనిని కట్టడి చేయడానికి నిర్ణయం తీసుకోవడం చాలా ముఖ్యమని చెప్పారు. దీనిపై మనమంతా కలిసి పోరాడుదామని పిలుపునిచ్చారు. షాంఘై సహకార సంఘం (SCO) వర్చువల్ సమావేశంలో ఆయన మంగళవారం మాట్లాడారు.

Narendra Modi, Shehabaz Sharif
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : ఉగ్రవాదంపై ద్వంద్వ ప్రమాణాలను పాటిస్తున్న పాకిస్థాన్, చైనాలను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) కడిగిపారేశారు. ప్రపంచ శాంతికి ఉగ్రవాదం పెను ముప్పు అని, దీనిని కట్టడి చేయడానికి నిర్ణయం తీసుకోవడం చాలా ముఖ్యమని చెప్పారు. దీనిపై మనమంతా కలిసి పోరాడుదామని పిలుపునిచ్చారు. షాంఘై సహకార సంఘం (SCO) వర్చువల్ సమావేశంలో ఆయన మంగళవారం మాట్లాడారు. ఈ వర్చువల్ సమావేశంలో రష్యా అధ్యక్షుడు వ్లదిమిర్ పుతిన్ (Vladimir Putin), చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ (Xi Jinping), పాకిస్థాన్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ (Shehbaz Sharif) కూడా పాల్గొన్నారు.

మోదీ మాట్లాడుతూ, ఉగ్రవాదానికి ఆశ్రయం ఇస్తున్న పాకిస్థాన్‌పై పరోక్షంగా విరుచుకుపడ్డారు. ప్రపంచ శాంతికి ఉగ్రవాదం పెను ముప్పు అని చెప్పారు. దీనిని కట్టడి చేయడానికి నిర్ణయం తీసుకోవడం చాలా ముఖ్యమన్నారు. మనమంతా కలిసి ఉగ్రవాదంతో పోరాడాలని పిలుపునిచ్చారు. కొన్ని దేశాలు క్రాస్-బోర్డర్ టెర్రరిజంను తమ విధానాల్లో ఓ సాధనంగా వాడుకుంటున్నాయని, ఉగ్రవాదులకు ఆశ్రయం ఇస్తున్నాయని దుయ్యబట్టారు.

చైనాను పరోక్షంగా ప్రస్తావిస్తూ, ఉగ్రవాదానికి మద్దతిస్తున్న దేశాలను బహిరంగంగా విమర్శించడానికి ఎస్‌సీఓ సభ్య దేశాలు ముందుకు రావాలన్నారు. ఈ విషయంలో సంశయం పనికిరాదన్నారు. ఎస్‌సీఓ సభ్య దేశాలు ఇటువంటి దేశాల తీరును ఖండించాలన్నారు. ఉగ్రవాదంపై ద్వంద్వ ప్రమాణాలు ఉండకూడదన్నారు. ఉగ్రవాదానికి నిధులు అందకుండా చూడాలని, రాడికలైజేషన్ జరగకుండా చూడాలని, ఆ దిశగా ఎస్‌సీఓ సభ్య దేశాలు కృషి చేయాలని పిలుపునిచ్చారు.

‘భాషిణి’ని ఇస్తాం

యూరాసియా శాంతి, సౌభాగ్యాలు, అభివృద్ధికి ముఖ్యమైన వేదికగా ఎస్‌సీఓ ఎదిగిందని చెప్పారు. ఎస్‌సీఓలో భాషాపరమైన అడ్డంకులను తొలగించడం కోసం కృత్రిమ మేధాశక్తి (Artificial Intelligence) ఆధారిత వేదిక ‘భాషిణి’ని అందరితోనూ పంచుకుంటామని చెప్పారు. డిజిటల్ టెక్నాలజీకి, సమ్మిళిత వృద్ధికి ఇది ఉదాహరణగా నిలుస్తుందని తెలిపారు. ఐక్య రాజ్య సమితిలోనూ, ఇతర అంతర్జాతీయ వ్యవస్థలలోనూ సంస్కరణల కోసం ముఖ్యమైన గళంగా ఎస్‌సీఓ నిలవగలదని తెలిపారు. ఎస్‌సీఓ కుటుంబంలో కొత్త సభ్యునిగా ఇరాన్ చేరుతుండటం పట్ల సంతోషం వ్యక్తం చేశారు.

పాకిస్థాన్‌లోని లష్కరే తొయిబా ఉగ్రవాది, 26/11 ముంబై ఉగ్రవాద దాడుల సూత్రధారి సాజిద్ మిర్‌ను గ్లోబల్ టెర్రరిస్ట్‌గా ప్రకటించాలని ఐక్య రాజ్య సమితిలో భారత దేశం, అమెరికా ఇటీవల ప్రతిపాదించాయి. ఐక్య రాజ్య సమితి భద్రతా మండలి 1267 అల్ ఖైదా శాంక్షన్స్ కమిటీ నిబంధనల ప్రకారం మిర్‌ను బ్లాక్ లిస్ట్‌లో పెట్టాలని, ఆయన ఆస్తులను స్తంభింపజేయాలని, ఆయన విదేశీ ప్రయాణాలపై నిషేధం విధించాలని ప్రతిపాదించాయి. ఈ ప్రతిపాదనను చైనా అడ్డుకుంది.

ఇవి కూడా చదవండి :

Khalistan terrorists : సిక్కు తీవ్రవాదుల నిరసనలపై కెనడాను హెచ్చరించిన భారత్

Maha Congress : మహారాష్ట్ర కాంగ్రెస్ ఎమ్మెల్యేల సమావేశం మరికాసేపట్లో

Updated Date - 2023-07-04T15:56:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising