ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Tripura: త్రిపురలో బీజేపీ ప్రభుత్వ ప్రమాణ స్వీకారానికి మోదీ

ABN, First Publish Date - 2023-03-04T16:54:02+05:30

త్రిపురలో బీజేపీ ప్రభుత్వ ప్రమాణస్వీకార కార్యక్రమానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈనెల 8న హాజరుకానున్నట్టు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

అగర్తలా: త్రిపుర (Tripura)లో బీజేపీ (Bjp) ప్రభుత్వ ప్రమాణస్వీకార కార్యక్రమానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) ఈనెల 8న హాజరుకానున్నట్టు సీనియర్ అధికారి ఒకరు శనివారంనాడు తెలిపారు. ఇటీవల ముగిసిన అసెంబ్లీ ఎన్నికల్లో 60 అసెంబ్లీ స్థానాలకు బీజేపీ 32 సీట్లను గెలుచుకుని మెజారిటీ మార్క్‌ను దాటింది. బీజేపీ భాగస్వామ్య పార్టీ అయిన ఐపీఎఫ్‌టీ (IPFT) ఒక సీటు గెలుచుకుంది.

''త్రిపురలో ప్రధాని పర్యటనకు సంబంధించి సీనియర్ అధికారులతో చీఫ్ సెక్రటరీ ఎస్‌కే సిన్హా సమావేశం జరుపుతున్నారు. ఎస్‌పీజీ టీమ్ కూడా ఇవాళ వస్తోంది. మార్చి 8న త్రిపురలో ఏర్పాటు చేసే కొత్త ప్రభుత్వ ప్రమాణస్వీకారానికి ప్రధానమంత్రి హాజరవుతున్నారు'' అని సీనియర్ అధికారి ఒకరు మీడియాకు తెలిపారు.

మాణిక్ సాహా రాజీనామా..

త్రిపురలో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు మార్గం సుగమం చేస్తూ ముఖ్యమంత్రి మాణిక్ సాహా శుక్రవారంనాడు తన రాజీనామా పత్రాన్ని గవర్నర్ సత్యదేవ్ నారాయణ్ ఆర్యకు అందజేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఈనెల 8న కొత్త ప్రభుత్వ ప్రమాణ స్వీకారం ఉంటుందని, ప్రధానమంత్రి కూడా హాజరవుతారని చెప్పారు. అగర్తలాలోని వివేకానంద గ్రౌండ్స్‌లో కొత్త ప్రభుత్వ ప్రమాణస్వీకార కార్యక్రమం జరుగనుంది.

కాగా, ఎన్‌ఈడీఏ చైర్మన్‌గా కూడా ఉన్న అసోం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ శనివారంనాడు త్రిపుర వస్తున్నారని, ఆయనతో పాటు పార్టీ సీనియర్ నేతలు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు కొత్త ప్రభుత్వ ప్రమాణస్వీకార కార్యక్రమంలో పాల్గొంటారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రేవతీ త్రిపుర తెలిపారు. బీజేపీ రాష్ట్ర ఇన్‌చార్జి మహేష్ శర్మ, ఎన్నికల ఇన్‌చార్జి మహేంద్ర సింగ్ సైతం కొత్త ప్రభుత్వ ఏర్పాటు సన్నాహాల్లో ఉన్నారు. పార్టీకి కొత్తగా ఎన్నికైన సభ్యులతో సమావేశం తేదీని ఇంకా ఖరారు చేయాల్సి ఉందని బీజేపీ రాష్ట్ర ప్రతినిధి నబేందు భట్టాచార్జీ తెలిపారు.

Updated Date - 2023-03-04T16:54:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!