ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Vande Bharat Express: షిర్డీ సాయి భక్తులకు శుభవార్త

ABN, First Publish Date - 2023-02-09T08:52:33+05:30

షిర్డీ సాయి భక్తులకు శుభవార్త. ప్రముఖ పుణ్యక్షేత్రమైన షిర్డీకి వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలు సర్వీసు శుక్రవారం నుంచి...

Shirdi Vande Bharat Express
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రేపు ప్రధాని మోదీ ప్రారంభం

ముంబయి: షిర్డీ సాయి భక్తులకు శుభవార్త. ప్రముఖ పుణ్యక్షేత్రమైన షిర్డీకి వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలు సర్వీసు శుక్రవారం నుంచి అందుబాటులోకి రానుంది.(Vande Bharat Express) ముంబయి- సాయినగర్ షిర్డీ, ముంబయి- షోలాపూర్ వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలు సర్వీసులను ప్రధానమంత్రి నరేంద్రమోదీ(Prime Minister Narendra Modi) శుక్రవారం పచ్చజెండా ఊపి ప్రారంభించనున్నారు.

ఇది కూడా చదవండి :United Airlines Flight: విమానంలో మంటలు...నలుగురికి అస్వస్థత

దేశంలోనే 9,10 రూట్లలో వందేభారత్ రైళ్లను శుక్రవారం మోదీ ప్రారంభించనున్నారు.(PM Modi to Flag Off) ముంబయి-నాసిక్ రోడ్-సాయినగర్ షిర్డీ, ముంబయి-పూనా-షోలాపూర్ మార్గాల్లో(Mumbai-Solapur, Shirdi route) వందేభారత్ హైస్పీడ్ రైళ్లు ప్రయాణికులకు అందుబాటులోకి రానున్నాయి. ఛత్రపతి శివాజీ టెర్మినల్ నుంచి బయలుదేరే వందేభారత్ రైలు దాదర్, థానే, నాసిక్ రోడ్డు స్టేషన్ల మీదుగా సాయినగర్ షిర్డీకి చేరుకోనుంది.

ఇది కూడా చదవండి : Money Laundering case: ప్రముఖ సినీనటిపై మనీలాండరింగ్ కేసు

ముంబయిలో ఉదయం 6.20 గంటలకు బయలుదేరే ఈ రైలు 11.40 గంటలకు షిర్డీకి చేరుకోనుంది. షోలాపూర్ వందేభారత్ రైలు ఛత్రపతి శివాజీ టెర్మినల్ నుంచి బయలు దేరి దాదర్, కల్యాణ్, పూణే, కుర్దువాడి మీదుగా షోలాపూర్ చేరుకోనుంది. కేవలం మూడు గంటల్లో షోలాపూర్ చేరుకోనుంది. 16 బోగీలతో సౌకర్యవంతంగా ఉన్న ఈ వందేభారత్ రైలు గంటకు 160 కిలోమీటర్ల వేగంతో నడుస్తోంది. ఈ రైలులో మల్టీమీడియా సిస్టం, ఎయిర్ కండిషనింగ్, బయో వ్యాక్యూమ్ టాయ్ లెట్ సౌకర్యాలు కల్పించారు.

Updated Date - 2023-02-09T08:59:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising