ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

West Bengal: రెండో 'వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌'ను ప్రారంభించనున్న మోదీ

ABN, First Publish Date - 2023-05-17T19:00:19+05:30

కోల్‌కతా: పూరీ-హౌరా వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారంనాడు వర్చువల్ తరహాలో ప్రారంభించనున్నట్టు సౌత్ ఈస్ట్రన్ రైల్వే ఒక అధికారిక ప్రకటనలో తెలిపిది. పూరీ స్టేషన్‌లో జరిగే ప్రారంభోత్సవ కార్యక్రమంలో రైల్వే మంత్రి అశ్విన్ వైష్ణవ్ పాల్గొంటారు. వర్చువల్ తరహాలో మధ్యాహ్నం 1 గంటకు మోదీ ఈ ఎక్స్‌ప్రెస్ సర్వీసును జెండా ఊపి ప్రారంభిస్తారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కోల్‌కతా: పూరీ-హౌరా (Puri-Howrah) వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ (Vande Bharat Express)ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) గురువారంనాడు వర్చువల్ తరహాలో ప్రారంభించనున్నట్టు సౌత్ ఈస్ట్రన్ రైల్వే ఒక అధికారిక ప్రకటనలో తెలిపిది. పూరీ స్టేషన్‌లో జరిగే ప్రారంభోత్సవ కార్యక్రమంలో రైల్వే మంత్రి అశ్విన్ వైష్ణవ్ పాల్గొంటారు. వర్చువల్ తరహాలో మధ్యాహ్నం 1 గంటకు మోదీ ఈ ఎక్స్‌ప్రెస్ సర్వీసును జెండా ఊపి ప్రారంభిస్తారు. పశ్చిమబెంంగాల్‌‌కు కేటాయించిన రెండో వందే భారత్ రైలు ఇది కావడం విశేషం. హౌరా-న్యూ జలపాయ్‌గురి వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌‌ ఇప్పటికే ప్రారంభమైంది.

పశ్చిమబెంగాల్ నుంచి, ముఖ్యంగా కలకత్తా నుంచి పూరీ జగన్నాథుని సందర్శించేందుకు వెళ్లే భక్తుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. అందుకు అనుగుణంగా సెమీ-హైస్పీడ్ వందేభారత్ రైలు ఇప్పుడు అందుబాటులోకి వస్తోంది. పూరీ-హౌరా మధ్య ఉన్న 500 కిలోమీటర్ల దూరాన్ని ఆరున్నర గంటల్లో ప్రయాణికులు చేరుకోవచ్చు. మే 20 నుంచి రెగ్యులర్ సర్వీస్ ప్రారంభవుతుందని, గురువారం మినహా వారంలో ఆరు రోజులు ఈ సర్వీస్ అందుబాటులో ఉంటుందని అధికారులు తెలిపారు. ఈ రైలు హౌరా నుంచి ఉదయం 6.10 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 12.35 గంటలకు పూరీ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో మధ్యాహ్నం 1.50 గంటలకు బయలుదేరి రాత్రి 8.30 గంటలకు హౌరా చేరుకుంటుంది. 16 కోచ్‌లు ఉండే ఈ రైలు ఖరగ్‌పూర్, బాలాసోర్, భద్రక్, జైపూర్ కియోంజ్హార్ రోడ్డు, కటక్, భువనేశ్వర్, ఖుర్దా రోడ్ స్టేషన్లలో ఆగుతుంది.

Updated Date - 2023-05-17T19:00:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising