ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Union Budget 2023: అమృత్ కాల్‌లో ప్రవేశపెట్టిన తొలి చారిత్రక బడ్జెట్: మోదీ

ABN, First Publish Date - 2023-02-01T16:25:02+05:30

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటుకు సమర్పించిన 2023-2024 కేంద్ర బడ్జెట్ పై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) పార్లమెంటుకు (Parliamanet) సమర్పించిన 2023-2024 కేంద్ర బడ్జెట్ (Union Budget 2023-24)పై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) ప్రశంసలు కురిపించారు. చారిత్రక బడ్జెట్ ప్రవేశపెట్టారంటూ నిర్మలా సీతారామన్ టీమ్‌ను అభినందించారు. పేదలు, మధ్యతరగతి ప్రజానీకం, రైతులతో సహా సమాజంలోని అన్ని వర్గాల కలలను నెరవేర్చేందుకు బడ్జెట్ సహకరిస్తుందని అన్నారు. అమృత్‌కాల్‌లో ప్రవేశపెట్టిన తొలి బడ్జెట్ అని, భారత అభివృద్ధి కలలను సాకారం చేస్తుందని చెప్పారు. దేశాభివృద్ధికి బలమైన పునాదులు వేస్తుందన్నారు.

గ్రామీణ, పట్టణ ప్రాంతాల ప్రజల మహిళల జీవనం కోసం మరిన్ని మెరుగైన చర్యలు తీసుకున్నామని, మహిళా స్వయం సహాయక సంఘాలను మరింత మెరుగుపరిచి, ప్రత్యేక పొదుపు పథకాన్ని ప్రారంభించనున్నామని మోదీ చెప్పారు. విశ్వకర్మలకు తొలిసారి శిక్షణ, సహాయక పథకాన్ని ఈ బడ్జెట్‌లో ప్రవేశపెట్టామని అన్నారు. మన తృణధాన్యాలకు ప్రపంచంలోనే ఎంతో గుర్తింపు ఉందని, ఇప్పుడు ఈ 'సూపర్ ఫుడ్'కు 'శ్రీ అన్న' అనే పేరుతో కొత్త ఐడెంటిటీ కల్పించామన్నారు. ఇందువల్ల సేద్యం చేసే చిన్నకారు రైతులు, గిరిజనులు స్త్రీ, పురుషులకు ఆర్థిక పరిపుష్టి కలుగుతుందన్నారు.

మధ్యతరగతి వర్గానికి ఉపశమనం కలిగించే పలు చర్యలు కూడా బడ్జెట్‌లో తీసుకున్నామని, పన్నుల రేట్లు తగ్గించామని, తగిన ఉపశమనం కల్పించామని ప్రధాని చెప్పారు. ఇందువల్ల మధ్యతరగతి ప్రజలు మరింత మెరుగైన జీవనం సాగించగలరని చెప్పారు. ఈ బడ్జెట్ గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ గ్రోత్, గ్రీన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, గ్రీన్ జాబ్‌లను మరింత ప్రోత్సహించే స్థిరమైన భవిష్యత్తు కోసం సహకరిస్తుందని వివరించారు. 2023-24 బడ్జెట్‌లో సాంకేతికత, కొత్త ఆర్థిక వ్యవస్థపై దృష్టి సారించామని తెలిపారు.

Updated Date - 2023-02-01T16:31:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising