ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Raghav Chadha: అరెస్టుల పర్వంలో 'ఇండియా' కూటమి అగ్రనేతలే బీజేపీ టార్గెట్..!

ABN, First Publish Date - 2023-11-01T19:21:12+05:30

ఆమ్ ఆద్మీ పార్టీ నేత రాఘవ్ చద్దా బీజేపీపై సంచలన అరోపణలు చేశారు. 2024 ఎన్నికలకు ముందే 'ఇండియా' కూటమి నేతల అరెస్టును బీజేపీ టార్గెట్‌గా పెట్టుకుందని, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తో దీనిని మొదలుపెట్టనుందని అన్నారు.

న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) నేత రాఘవ్ చద్దా (Raghav Chadha) బీజేపీ (BJP)పై సంచలన అరోపణలు చేశారు. 2024 ఎన్నికలకు ముందే 'ఇండియా' (I.N.D.I.A.) కూటమి నేతల అరెస్టును బీజేపీ (BJP) టార్గెట్‌గా పెట్టుకుందని, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal)తో దీనిని మొదలుపెట్టనుందని అన్నారు. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కుంభకోణంలో మనీ లాండరింగ్ కేసు కింద ఈడీ విచారణ ముందుకు కేజ్రీవాల్ గురువారంనాడు హాజరుకానున్న నేపథ్యంలో రాఘువ్ చద్దా మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. 2014 నుంచి దర్యాప్తు సంస్థలు రిజిస్టర్ చేసిన కేసుల్లో 95 శాతం కేసులు విపక్ష నాయకులపైనే ఉన్నాయని చద్దా తెలిపారు.


ఇండియా కూటమే అసలైన టార్గెట్..

బీజేపీ అసలు సిసలైన టార్గెట్ ఇండియా కూటమేనని చద్దా అన్నారు. ''ఇండియా కూటమి అగ్రనేతలను, పార్టీ అధ్యక్షులను కటకటాల వెనక్కి నెడితే బీజేపీ ఒక్కటే రేసులో ఉంటుంది. అప్పుడు విజయం తేలివుతుంది. ఈ లైన్స్‌లోనే బీజేపీ వ్యూహం ఉంది. ఇందులో భాగంగానే తొలుత ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ను బీజేపీ ఏజెన్సీలు అరెస్టు చేయాలనుకుంటున్నాయి'' అని ఆయన ఆరోపించారు.


రెండు, మూడు అరెస్టులు ఎవరివంటే..?

కేజ్రీవాల్ తర్వాత దర్యాప్తు సంస్థల రెండో టార్గెట్ జార్ఖాండ్ సీఎం హేమంత్ సోరెన్ అని చద్దా జోస్యం చెప్పారు. హేమంత్ సోరెన్‌కు ఉన్న ప్రజాదరణను బీజేపీ ఓర్వలేకపోతోందని అన్నారు. సోరెన్ తర్వాత తేజస్వి యాదవ్ అరెస్టు ఉండొచ్చని, తేజస్వి అరెస్టు ద్వారా బీహార్‌లో ఆర్జేడీ నిలదొక్కుకోకుండా చేయాలన్నదే వారి ఉద్దేశమని అన్నారు. ఆ తర్వాత పశ్చిమబెంగాల్‌పైనే ఏజెన్సీలు దృష్టి సారిస్తాయని చెప్పారు.


ఆ తర్వాత జాబితాలో...

ఢిల్లీ లోక్‌సభ ఎన్నికల్లో ఏడు స్థానాల్లోనూ ఓడిపోతామనే విషయం బీజేపీకి బాగా తెలుసునని చద్దా అన్నారు. ఆ కారణంగానే కేజ్రీవాల్‌ను అరెస్టు చేయాలనే ప్లాన్ చేస్తోందని ఆరోపించారు. దర్యాప్తు సంస్థల తదుపరి టార్గెట్‌ జాబితాలో పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఆమె మేనల్లుడు అభిషేక్ బెనర్జీ, కేరళ సీఎం పినరయి విజయన్, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్, మహారాష్ట్రలో శివసేన, ఎన్‌సీపీ అగ్రనేతలు ఉన్నారని చద్దా ఆరోపించారు.

Updated Date - 2023-11-01T19:26:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising