ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Raghav Chadha: ‘ఇండియా’ని విచ్ఛిన్నం చేయాలనుకున్నారు, వాళ్లే గోతిలో పడ్డారు.. బీజేపీపై ఆప్ ఎంపీ చురకలు

ABN, First Publish Date - 2023-09-18T20:38:51+05:30

తమకు బీజేపీతో ఎలాంటి పొత్తు లేదని సోమవారం అన్నాడీఎంకే సీనియర్ నేత జయకుమార్ షాకింగ్ వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ అంశంపై ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్ధా తనదైన శైలిలో స్పందిస్తూ..

తమకు బీజేపీతో ఎలాంటి పొత్తు లేదని సోమవారం అన్నాడీఎంకే సీనియర్ నేత జయకుమార్ షాకింగ్ వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ అంశంపై ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్ధా తనదైన శైలిలో స్పందిస్తూ.. బీజేపీకి చురకలంటించారు. ‘‘ఇండియా కూటమిని విచ్ఛిన్నం చేయాలని ఎవరైతే ప్రయత్నించారో, వాళ్లే విచ్ఛిన్నం అయ్యారు. ఈరోజు కూడా అదే జరిగింది. మా ఇండియా కూటమి నిన్న బలంగా ఉంది, ఈరోజు కూడా బలంగానే ఉంది. పాపం.. ఇతర ఇళ్లపై రాళ్లు రువ్వే NDA మాత్రం తన సొంత ఇంటికి కాపాడుకోలేకపోయింది’’ అంటూ ట్విటర్ మాధ్యమంగా రాఘవ్ చద్ధా ఘాటుగా రియాక్ట్ అయ్యారు. సీట్ల పంపకాల విషయంలో ఇండియా కూటమిలో విభేదాలు, అంతర్గత తగాదాలు మొదలయ్యాయని.. ముఖ్యంగా బెంగాల్, ఢిల్లీ, పంజాబ్ సీట్ల విషయంలో అభిప్రాయబేధాలు తలెత్తాయని ఇటీవల ఓ ప్రచారం జోరందుకుంది. ఈ ప్రచారంలో ఏమాత్రం వాస్తవం లేదని తిప్పికొట్టేందుకు.. పై విధంగా రాఘవ్ చద్ధా ట్వీట్ చేశారు.


ఇదిలావుండగా.. ప్రస్తుతం ఆమ్ ఆద్మీ పార్టీ రెండు రాష్ట్రాల్లో అధికారంలో ఉంది. అయితే.. కాంగ్రెస్‌తో ఆప్ పొత్తు పెట్టుకోవడంపై ఆ పార్టీలో ఉన్న కొందరు నేతలకు ఏమాత్రం నచ్చడం లేదని, ఈ పొత్తుపై వాళ్లు వ్యతిరేకంగా ఉన్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి.. బెంగాల్, కేరళ రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి ఉందని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఇలాంటి తరుణంలో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా తాము ఎవరితోనూ పొత్తు పెట్టుకోవడం లేదని ప్రకటించడంతో, ఇండియా కూటమిలో విభేదాలున్న వాదనలకు మరింత బలం చేకూరింది. ఇదే సమయంలో మాజీ ఎంపీ నీలోత్పాల్ బసు మాట్లాడుతూ.. ఇండియా కూటమిలో అభిప్రాయభేదాలు ఉన్నాయని, ఇది వాస్తవం అంటూ కుండబద్దలు కొట్టారు. కానీ.. ఇందులో ఏమాత్రం వాస్తవం లేదని, ఇండియా కూటమి బలంగానే ఉందని కూటమిలోని నేతలు స్పష్టం చేస్తున్నారు. సోమవారం ఉదయం తమ కూటమి ఐక్యంగానే ఉందని నితీశ్ కుమార్ తెలుపగా.. ఇప్పుడు రాఘవ్ చద్ధా తమ కూటమి ఎప్పటికీ బలంగానే ఉంటుందని క్లారిటీ ఇచ్చేశారు.

కాగా.. ద్రవిడ మహా నేత సీఎన్‌ అన్నాదురైపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై విమర్శలు చేయడంతో అన్నాడీఎంకే సీనియర్ నేత జయకుమార్‌ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తమ నేత, దివంగత సీఎం అన్నాదురై పట్ల అవమానకరంగా మాట్లాడితే పార్టీ కార్యకర్తలు సహించరని తేల్చి చెప్పారు. అన్నాడీఎంకేతో అన్నామలై పొత్తును కోరుకోవడం లేదని, కానీ ఆ పార్టీ శ్రేణులు కావాలనుకుంటున్నాయని అన్నారు. మా నేతలపై విమర్శలు చేస్తుంటే మేం సహించాలా? బీజేపీని మేం ఎందుకు మోయాలి? అని ప్రశ్నించారు. బీజేపీ ఇక్కడ అడుగు పెట్టలేదని మండిపడ్డ ఆయన.. మీ ఓటు బ్యాంకు తెలుసని చురకలంటించారు.

Updated Date - 2023-09-18T20:38:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising