ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Rahul Gandhi : రాహుల్ గాంధీకి కావలసింది గోవాలో దొరికింది!

ABN, First Publish Date - 2023-08-04T11:33:37+05:30

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఉత్తర గోవాలోని మనోహర్ అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్తూ, మార్గమధ్యంలో ఓ కెన్నెల్‌కు వెళ్లారు. అక్కడి కుక్క పిల్లలతో సరదాగా ఆడుకుంటూ ఆనందించారు. ఓ కుక్క పిల్లను తనతోపాటు ఢిల్లీకి తెచ్చుకున్నారు. మరో కుక్క పిల్లను కూడా ఆయన ఇష్టపడ్డారని, దానిని తాము ఢిల్లీకి పంపిస్తామని కెన్నెల్ యజమానురాలు చెప్పారు.

న్యూఢిల్లీ : కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఉత్తర గోవాలోని మనోహర్ అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్తూ, మార్గమధ్యంలో ఓ కెన్నెల్‌కు వెళ్లారు. అక్కడి కుక్క పిల్లలతో సరదాగా ఆడుకుంటూ ఆనందించారు. ఓ కుక్క పిల్లను తనతోపాటు ఢిల్లీకి తెచ్చుకున్నారు. మరో కుక్క పిల్లను కూడా ఆయన ఇష్టపడ్డారని, దానిని తాము ఢిల్లీకి పంపిస్తామని కెన్నెల్ యజమానురాలు చెప్పారు.

రాహుల్ గాంధీ బుధవారం రాత్రి గోవా వెళ్లారు. గోవా పీసీసీ చీఫ్ అమిత్ పట్కర్‌తోపాటు కొందరు ఎమ్మెల్యేలతో ఓ హోటల్‌లో సమావేశమయ్యారు. ఆయన తిరిగి గురువారం ఉదయం 9 గంటల ప్రాంతంలో ఉత్తర గోవాలోని మోపాలో ఉన్న మనోహర్ అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్లారు. మార్గమధ్యంలో ఆయన ఓ కెన్నెల్‌ను చూశారు. వెంటనే అందులోకి వెళ్లి, కుక్క పిల్లలతో సరదాగా ఆడుకున్నారు. మూడు నెలల వయసుగల జాక్ రస్సెల్ టెర్రియర్ పప్పీ ఆయనకు చాలా నచ్చింది. దానిని తన వెంట ఢిల్లీకి తెచ్చుకున్నారు.

ఈ కెన్నెల్‌ను శివాని పిట్రే, స్టాన్లీ బ్రగన్కా దంపతులు నడుపుతున్నారు. శివాని మాట్లాడుతూ, రాహుల్ గాంధీ చాలా సౌమ్యంగా, స్నేహపూర్వకంగా మాట్లాడారని తెలిపారు. ఆయన ఎక్కువ సమయం కుక్క పిల్లలతో ఆడుకుంటూ గడిపారని, చాలా సామాన్యంగా ఉన్నారని తెలిపారు. ఆయన ఓ కుక్క పిల్లను తీసుకెళ్లారని, మరొకదానిని కూడా ఎంచుకున్నారని చెప్పారు. ఈ రెండో కుక్క పిల్లను తాము ఆయనకు పంపిస్తామని చెప్పారు. రాహుల్ ముందుగానే ఓ వ్యక్తిని తమ వద్దకు పంపించారని, కుక్క పిల్ల గురించి వివరాలు తెలుసుకున్నారని చెప్పారు. దానిని స్వయంగా చూడటం కోసం ఆయన వచ్చారన్నారు.


ఇవి కూడా చదవండి :

Gyanvapi : జ్ఞానవాపిలో ఏఎస్ఐ సర్వే ప్రారంభం.. బహిష్కరించిన ముస్లిం పక్షం..

Kedarnath yatra : కేదార్‌నాథ్ యాత్ర మార్గంలో విరిగిపడిన కొండచరియ.. శిథిలాల్లో 10 మంది చిక్కుకున్నట్లు ఆందోళన..

Updated Date - 2023-08-04T11:33:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising