ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Rahul Gandhi: జీఎస్టీపై రాహుల్ కీలక వ్యాఖ్యలు

ABN, First Publish Date - 2023-04-24T22:12:40+05:30

కేవలం ఒకరిద్దరు పారిశ్రామికవేత్తలపైనే కేంద్రం ఫోకస్ ఉందన్నారు. అదానీ, అంబానీలకు...

Rahul Gandhi comments on GST in Karnataka Assembly Elections
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల (Karnataka Assembly Elections) వేళ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) రామ్‌దుర్గ్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రైతులను ఉద్దేశించి ప్రసంగించారు. కర్ణాటకలో అధికారంలోకి వస్తే రైతుల ప్రయోజనాలు కాపాడతామన్నారు. పంటలకు సరైన ధరలు అందేలా చూస్తామన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రైతులను నిర్లక్ష్యం చేస్తోందని రాహుల్ ఆరోపించారు. కేవలం ఒకరిద్దరు పారిశ్రామికవేత్తలపైనే కేంద్రం ఫోకస్ ఉందన్నారు. అదానీ, అంబానీలకు వేలాది ఎకరాలున్నాయని, రుణాలు సులభంగా దొరుకుతాయని, వాళ్ల రుణాలను మాఫీ కూడా చేస్తారని అయితే పేద రైతుల గురించి మాత్రం బీజేపీ సర్కారు పట్టించుకోవడం లేదన్నారు.

కేంద్రం తీసుకొచ్చిన జీఎస్టీపై(GST) రాహుల్ విమర్శలు గుప్పించారు. కొందరికి ప్రయోజనం చేకూర్చేందుకే జీఎస్టీ తీసుకొచ్చారని, చాలామందికి జీఎస్టీ అంటే ఏంటో కూడా ఇంకా బోధపడలేదన్నారు. తాము అధికారంలోకి వస్తే జీఎస్టీని సవరిస్తామని, దేశమంతా ఒకటే టాక్స్ ఉండేలా చూస్తామని, అది కూడా తక్కువ టాక్స్ ఉండేలా చూస్తామని రాహుల్ హామీ ఇచ్చారు.

కర్ణాటక (Karnataka)లో మే 10న ఎన్నికలు నిర్వహించనున్నారు. ఓట్ల లెక్కింపు మే 13న జరుగుతుందని ఎన్నికల కమిషన్ ప్రకటించింది.

Updated Date - 2023-04-24T22:13:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising