ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Bharat Jodo Yatra : పుల్వామా అమరులకు రాహుల్ గాంధీ నివాళులు

ABN, First Publish Date - 2023-01-28T20:38:39+05:30

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) శనివారం భారత్ జోడో యాత్ర (Bharat Jodo Yatra)లో భాగంగా జమ్మూ-కశ్మీరులో అమర వీరులకు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) శనివారం భారత్ జోడో యాత్ర (Bharat Jodo Yatra)లో భాగంగా జమ్మూ-కశ్మీరులో అమర వీరులకు నివాళులర్పించారు. 2019 ఫిబ్రవరి 14న పుల్వామాలో జరిగిన ఉగ్రవాద దాడిలో అమరులైన సైనికులకు శ్రద్ధాంజలి ఘటించారు. జైషే మహమ్మద్ ఉగ్రవాది జరిపిన ఆత్మాహుతి దాడిలో 40 మంది సీఆర్‌పీఎఫ్ జవాన్లు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.

కాంగ్రెస్ ఇచ్చిన ట్వీట్‌లో, పుల్వామా అమరులకు రాహుల్ గాంధీ నివాళులర్పించినట్లు తెలిపింది. ధైర్యసాహసాలు నిండిన అమరుల రక్తం కలిసిన నేలకు వందనం చేసినట్లు తెలిపింది.

జమ్మూ-కశ్మీరులోని అవంతిపొర నుంచి రాహుల్ శనివారం పాదయాత్రను కొనసాగించారు. ఈ యాత్రలో పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ కూడా పాల్గొన్నారు. భారత్ జోడో యాత్ర ఈ నెల 30న కశ్మీరులో ముగుస్తుంది. ఈ యాత్ర సెప్టెంబరు 7న తమిళనాడులోని కన్యా కుమారి నుంచి ప్రారంభమైన సంగతి తెలిసిందే.

Updated Date - 2023-01-28T20:40:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising