ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

One Nation, One Election : ‘ఒక దేశం-ఒకేసారి ఎన్నికలు’పై రాహుల్ గాంధీ ఆగ్రహం

ABN, First Publish Date - 2023-09-03T16:24:58+05:30

దేశవ్యాప్తంగా లోక్ సభ, శాసన సభల ఎన్నికలు ఒకేసారి నిర్వహించాలనే ఆలోచన సరైనది కాదని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఆరోపించారు. ఈ విధంగా ఎన్నికలను నిర్వహించడం ఇండియన్ యూనియన్‌పైనా, దానిలోని అన్ని రాష్ట్రాలపైనా దాడి చేయడమేనని చెప్పారు.

Rahul Gandhi

న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా లోక్ సభ, శాసన సభల ఎన్నికలు ఒకేసారి నిర్వహించాలనే ఆలోచన సరైనది కాదని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఆరోపించారు. ఈ విధంగా ఎన్నికలను నిర్వహించడం ఇండియన్ యూనియన్‌పైనా, దానిలోని అన్ని రాష్ట్రాలపైనా దాడి చేయడమేనని చెప్పారు. ఇండియా అంటే రాష్ట్రాల యూనియన్ అని చెప్పారు.

రాహుల్ గాంధీ ఆదివారం ఇచ్చిన ట్వీట్‌లో, ‘‘ఇండియా, అంటే భారత్, రాష్ట్రాల యూనియన్. ‘ఒక దేశం-ఒకేసారి ఎన్నికలు’ అనే ఆలోచన ఇండియన్ యూనియన్‌పైనా, దానిలోని అన్ని రాష్ట్రాలపైనా దాడి చేయడమే’’ అని తెలిపారు.

'ఒక దేశం ఒకేసారి ఎన్నికలు' (One Nation-One Election) కమిటీలో 8 మంది సభ్యులను నియమిస్తూ కేంద్ర న్యాయశాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. కమిటీ చైర్మన్‌గా మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ (Ramnath Kovind)ను నియమించింది. సభ్యులుగా కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా, లోక్‌సభలో కాంగ్రెస్ నేత అధీర్ రంజన్ చౌదరి, గులాం నబీ ఆజాద్, 15వ ఆర్థిక సంఘం మాజీ చైర్మన్ ఎన్‌కే సింగ్, లోక్‌సభ మాజీ సెక్రటరీ జనరల్ డాక్టర్ సుభాష్ ఎస్. కస్యప్, సీనియర్ న్యాయవాది హరీష్ సాల్వే, మాజీ చీఫ్ విజిలెన్స్ కమిషనర్ సంజయ్ కొఠారిలను నియమించింది. ప్రత్యేక ఆహ్వానితునిగా కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్, సెక్రటరీగా కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి నితీష్ చంద్రలను నియమించింది.


పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు

ఈ నెల 18 నుంచి 22 వరకు పార్లమెంటు ప్రత్యేక సమావేశాల నిర్వహణకు ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో జమిలీ ఎన్నికల కోసం బిల్లును ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నాయనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. ''ఒక దేశం-ఒకేసారి ఎన్నికలు'' అమల్లోకి వస్తే దేశవ్యాప్తంగా లోక్‌సభ, రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి జరుగుతాయని, సమయం, ఖర్చు ఆదా అవుతాయని కేంద్రం చెబుతోంది.

కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ ఆదివారం ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, రానున్న శాసన సభల ఎన్నికలను లోక్ సభ ఎన్నికలతోపాటు నిర్వహించడం కోసం వాయిదా వేయాలనే ఆలోచన కేంద్ర ప్రభుత్వానికి లేదని చెప్పారు. కొన్ని రాష్ట్రాల శాసన సభల ఎన్నికలను ముందుకు, వెనుకకు జరుపుతారని జరుగుతున్న ప్రచారమంతా మీడియా అభిప్రాయమని తెలిపారు.


ఇవి కూడా చదవండి :

DMK : సనాతన ధర్మం మలేరియా, డెంగ్యూ వంటిది : తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్

Rahul Gandhi: దేశ ఆర్థిక వ్యవస్థ నడ్డివిరిచిన బీజేపీ: రాహుల్

Updated Date - 2023-09-03T16:24:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising