ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

JP Nadda: అది భారత్ జోడో కాదు, టోడో యాత్ర..

ABN, First Publish Date - 2023-01-15T18:48:18+05:30

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జగత్ ప్రకాష్ నడ్డా విమర్శలు గుప్పించారు. రాహుల్ మన సాయుధ బలగాల నైతక స్థైర్యాన్ని..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi)‌పై బీజేపీ (Bjp) జాతీయ అధ్యక్షుడు జగత్ ప్రకాష్ నడ్డా (JP Nadda) విమర్శలు గుప్పించారు. రాహుల్ మన సాయుధ బలగాల నైతక స్థైర్యాన్ని దిగజార్చే ప్రయత్నం చేస్తున్నారని, ఆయన చేపట్టిన యాత్ర...భారత్ జోడో కాదని, భారత్ టోడో అని అన్నారు. శనివారం రాత్రి జరిగిన 'ఆప్ కీ అదాలత్' కార్యక్రమంలో నడ్డా మాట్లాడుతూ, రాహుల్ గాంధీ కంటే మన సాయుధ బలగాల నైతికతను బలహీనపరచే ప్రయత్నం చేసినవారెవ్వరూ లేరని అన్నారు. సర్జికల్ దాడులు, బాలాకోట్‌లో ఐఏఎఫ్ ఆపరేషన్‌ను రాహుల్ ప్రశ్నించారని, ఇటీవల మన బలగాలను కొట్టారంటూ వ్యాఖ్యానించారని అన్నారు. ''ఈ పదాలను వాడిన వారెవరు? బలగాల నైతిక స్థైర్యాన్ని దిగజార్చిందెవరు? రాహుల్ గాంధీకి మన బలగాల పట్ల సదుద్దేశం లేదు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో మన సరిహద్దులు సురక్షితంగా ఉన్నాయి. మన సరిహద్దులను పూర్తి శక్తియుక్తులతో సైనికులు కాపాడుతున్నారు'' అని నడ్డా అన్నారు.

భారత్ జోడో యాత్రపై నడ్డా మాట్లాడుతూ.. ''ముందు ఆయనను సజావుగా యాత్రను ముగియనీయండి. ఇప్పటికైనా ఆయన మొదటిసారి ఇల్లు విడిచి బయటకు వచ్చారు. రియల్ ఇండియా ఏమిటో చూసే అవకాశం ఆయనకు కలిగింది'' అని అన్నారు. విద్వేష వ్యాప్తిని తొలగించేందుకు, ప్రేమభావాలను విస్తరింపజేసేందుకు యాత్రను చేపట్టినట్టు రాహుల్ చెబుతున్నారు కదా అని అడిగినప్పుడు, ఏ నేత అయినా గతంలో ఏమి మాట్లాడారో ఒకసారి విశ్లేషణ చేసుకోవాలని అన్నారు. ''ఆయన (రాహుల్) జేఎన్‌యూకు వెళ్లినప్పుడు అక్కడి వారు పార్లమెంటుపై దాడి చేసిన అఫ్జల్ గురుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అఫ్జల్ గురును చంపిందెవరు? సుప్రీంకోర్టు జడ్జిలా? అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీనా? రాహుల్ అక్కడకు వెళ్లి వారితో కలిసికట్టుగా పోరాటం చేస్తానని చెప్పారు. జేఎన్‌యూ నుంచి వచ్చిన వాళ్లలో ఒకరు ఇప్పుడు కాంగ్రెస్‌లో ఉన్నారు. రాహుల్‌గాంధీతో కలిసి నడిచారు. వీళ్లు భారత్‌ను ఐక్యం చేసేవాళ్లా? విభజించాలని చూసేవాళ్లా? ఇదెంతమాత్రం భారత్ జోడో యాత్ర కాదు, ఇది భారత్ టోడో యాత్ర'' అని నడ్డా ఘాటుగా సమాధానమిచ్చారు.

కేజ్రీవాల్ మాటలు ఎవరూ సీరియస్‌గా తీసుకోరు..

భారతీయ జనతా పార్టీ ఇంతవరకూ 277 మంది మంది ఎమ్మెల్యేల ఫిరాయింపులను ప్రోత్సహించిందని, ఇందుకోసం ఒక్కో ఎమ్మెల్యే రూ.20 కోట్లు తీసుకుంటే, అది రూ.5,5000 కోట్లు అవుతుందని ఆప్ చీఫ్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలను నడ్డా తిప్పికొట్టారు. కేజ్రీవాల్ మాటలను సీరియస్‌గా పట్టించుకునేది ఎవరని ప్రశ్నించారు. నేను నిజమైన నిజాయితీపరుడనని ప్లకార్లులు పట్టుకున్న నేతను తాను మొదటిసారిగా చూశానని, విశ్వసనీయత ఆధారంగానే ఎవరైనా నాయకుడు అవుతారని, ఒకరోజు కార్యక్రమంతో మొక్కుబడిగా సరిపుచ్చుకునే వారు నాయకుడు కాలేరని కేజ్రీవాల్‌ను విమర్శించారు.

ఎన్‌డీఏకు నితీష్ గుడ్‌బైపై...

బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఎన్డీయేను ఎందుకు విడిచిపెట్టారని అడిగిన ప్రశ్నకు నడ్డా సమాధానమిస్తూ, ఆయన నీడను చూసి కూడా భయపడటం మొదలుపెట్టారని, నితీష్‌కుమార్‌కు తమ పార్టీ (బీజేపీ) ఇచ్చిన గౌరవం ఏ పార్టీ కూడా ఇవ్వలేదని అన్నారు. బీహార్ ప్రగతి కోసం ఆయనకు తాము పూర్తిగా సహకరించామని, ఇవాళ బీహార్‌లో పరిస్థితి ఏమిటనేది ప్రతి ఒక్కరికి తెలుసునని అన్నారు. ఈరోజు కూడా బీహార్‌లో ఒంటరిగా పోటీకి వెళ్లే సామర్థ్యం బీజేపీకి ఉందని, భాగస్వాములను కూడా కలుపుకొని ముందుకు వెళ్తామని చెప్పారు.

జేడీయూతో తెగతెంపులు చేసుకోనున్నారా అనే అడిగినప్పుడు, ఎవరైనా తమ కుటుంబాన్ని వదిలి మాతో రావాలని కోరుకుంటే వారిని ఆపమని చెప్పారు. తమ రాజకీయ సిద్ధాంతాన్ని బలంగా నమ్మి, సమాజానికి మేలు చేయగలమని భావించే వారెవరైనా సరే వారిని పార్టీలోకి తీసుకుంటామని చెప్పారు. గత 8 ఏళ్లలో ఎన్డీయేను 19 పార్టీలు విడిచిపెట్టాయి కదా అని ప్రశ్నించగా, కొందరు ఏదో ఒక ఎజెండాతో ఎన్డీయేను విడిచిపెట్టారని, కొందరు ఫ్యామిలీ ఎజెండాతో వెళ్లిపోయారని, తాము మాత్రం ఎవరినీ వదులుకోలేదని చెప్పారు. ప్రాంతీయ పార్టీలకు చిన్న గోల్స్ ఉంటాయని, వారు విస్తృత లక్ష్యాలున్న భారతీయ జనతా పార్టీతో ఎలా పోటీపడగలరని ప్రశ్నించారు. సైద్ధాంతిక నిబద్ధత, ఆర్థిక అంశాలపై అవగాహన కలిగిన పార్టీ మాత్రమే మరింత పురోగమనం సాధిస్తుందని అన్నారు.

Updated Date - 2023-01-15T18:48:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising