ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Gehlot Vs Shekhawat : కేంద్ర మంత్రి షెఖావత్‌కు సీఎం అశోక్ గెహ్లాట్ సవాల్

ABN, First Publish Date - 2023-04-28T19:24:33+05:30

కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెఖావత్ (Union Minister Gajendra Singh Shekhawat)పై రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్

Ashok Gehlot, Gajendra Singh Shekhawat
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జైపూర్ : కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెఖావత్ (Union Minister Gajendra Singh Shekhawat)పై రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ (Rajasthan Chief Minister Ashok Gehlot) తీవ్రంగా విరుచుకుపడ్డారు. సంజీవని క్రెడిట్ కో-ఆపరేటివ్ సొసైటీ కుంభకోణంలో షెఖావత్ ప్రమేయాన్ని గుర్తు చేస్తూ ఓ సవాల్ విసిరారు. తనను రావణాసురుడిగా అభివర్ణించడంపై మండిపడుతూ, ‘‘నేను రావణాసురుడినైతే, మీరు శ్రీరాముడిగా మారి, పెట్టుబడిదారుల సొమ్మును తిరిగి ఇచ్చేయండి’’ అన్నారు. ‘‘మీరు నా మీద రాళ్లు విసిరితే, వాటిని నేను పేదల కోసం ఇళ్లు నిర్మించడానికి ఉపయోగిస్తాను’’ అని గెహ్లాట్ చెప్పారు.

బీజేపీ చిత్తోడ్‌గఢ్‌లో గురువారం నిర్వహించిన జన ఆక్రోశ్ సభలో షెఖావత్ మాట్లాడుతూ, అశోక్ గెహ్లాట్‌ను రావణాసురుడిగా అభివర్ణించారు. రాజస్థాన్ రాజకీయాల్లో గెహ్లాట్ ఓ రావణాసురుడివంటివారని ఆరోపించారు. రావణాసురుడి వంటి అశోక్ గెహ్లాట్ పాలనకు తెర దించాలని, రాష్ట్రంలో రామ రాజ్యాన్ని స్థాపించాలని కోరుకునేవారంతా చేతులు ఎత్తాలని ప్రజలను కోరారు.

షెఖావత్ వ్యాఖ్యలపై అశోక్ గెహ్లాట్ శుక్రవారం స్పందించారు. గెహ్లాట్ శుక్రవారం రవట్సర్ పట్టణంలోని ఓ సహాయక శిబిరాన్ని సందర్శించి, పరిస్థితిని సమీక్షించారు. అనంతరం ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ, సంజీవని క్రెడిట్ కో-ఆపరేటివ్ సొసైటీ కుంభకోణంలో షెఖావత్ స్నేహితులు జైలులోనే ఉన్నారన్నారు. షెఖావత్ కూడా జైలుకు వెళ్లే అవకాశం ఉందన్నారు. నైతిక బాధ్యత వహించి షెఖావత్ తన కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేయాలన్నారు. లేదంటే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) అయినా ఆయనను పదవి నుంచి తొలగించాలన్నారు.

ఇటీవలి కాలంలో షెఖావత్, బీజేపీ నేతలు తనను దూషించడం ప్రారంభించారన్నారు. ‘‘నేను రావణాసురుడినా? సంజీవని సొసైటీలో మీరు (షెఖావత్) 2.5 లక్షల మంది ప్రజల సొమ్మును దోచుకున్నారు. బాధితులు నాశనమైపోయారు. మీ స్నేహితులు జైలులో ఉన్నారు. మీరు కూడా ఎప్పుడో ఒకప్పుడు జైలుకెళ్లవచ్చు’’ అన్నారు.

ఇదిలావుండగా, ఈ కుంభకోణం కేసులో షెఖావత్‌ అరెస్టును రాజస్థాన్ హైకోర్టు జోధ్‌పూర్ ధర్మాసనం ఇటీవల నిలిపేసింది. మరోవైపు ఈ కుంభకోణంతో తనకు సంబంధం ఉందని ఆరోపించడం ద్వారా గెహ్లాట్ తన పరువు, ప్రతిష్ఠలకు భంగం కలిగించారని ఆరోపిస్తూ షెఖావత్ ఢిల్లీ కోర్టులో పరువు నష్టం దావా వేశారు.

దీనిపై గెహ్లాట్ స్పందిస్తూ, షెఖావత్ హైకోర్టు నుంచి స్టే తెచ్చుకున్నారని, తాను నిందితుడిని కానని ఆయన చెప్తూ ఉంటారని, నిందితుడు కానట్లయితే కోర్టుకు ఎందుకు వెళ్లారని ప్రశ్నించారు. బెయిలు ఎందుకు పొందారని నిలదీశారు. నైతిక బాధ్యత వహించి కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. షెఖావత్ రాజీనామా చేయకపోతే, ఆయనను మోదీ తన మంత్రివర్గం నుంచి తొలగించాలన్నారు.

ఇవి కూడా చదవండి :

Supreme Court : విద్వేష ప్రసంగాలపై తక్షణం కేసులు నమోదు చేయాలి.. రాష్ట్రాలకు సుప్రీంకోర్టు ఆదేశం..

Sri Ram Navami : శ్రీరామ నవమి హింసాకాండలో మమత పాత్రపై దర్యాప్తు జరగాలి : వీహెచ్‌పీ

Updated Date - 2023-04-28T19:24:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising