Bhiwani murders: భివానీ హత్యల కేసులో ఆరుగురి అరెస్ట్

ABN, First Publish Date - 2023-02-17T20:06:26+05:30

హర్యానాలోని భివానీలో గురువారం నాసిర్, జునెయిద్‌ల హత్యకు సంబంధించిన కేసులో రాజస్థాన్ పోలీసులు ఆరుగురిని అరెస్ట్ చేశారు.

Bhiwani murders: భివానీ హత్యల కేసులో ఆరుగురి అరెస్ట్
Rajastan Police
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : హర్యానాలోని భివానీలో గురువారం నాసిర్, జునెయిద్‌ల హత్యకు సంబంధించిన కేసులో రాజస్థాన్ పోలీసులు ఆరుగురిని అరెస్ట్ చేశారు. తగులబడిన వాహనంలో ఈ ఇద్దరి అస్థిపంజరాలు కనిపించిన సంగతి తెలిసిందే. వీరు రాజస్థాన్‌లోని భరత్‌పూర్‌వాసులు. అయితే వీరిలో ఒకరు ఆవుల అక్రమ రవాణాకు తరచూ పాల్పడినట్లు పోలీసులు చెప్పారు.

మృతుల కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం, వీరిద్దరినీ భరత్‌పూర్ గ్రామం నుంచి కొందరు వ్యక్తులు బుధవారం అపహరించినట్లు తెలుస్తోంది. బజరంగ్ దళ్‌కు అనుబంధంగా పని చేసే గో రక్షకులు ఈ దుశ్చర్యకు పాల్పడి ఉంటారని బాధితులు ఆరోపిస్తున్నారు.

రాజస్థాన్, భరత్‌పూర్ రేంజ్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ జనరల్ గౌరవ్ శ్రీవాస్తవ తెలిపిన వివరాల ప్రకారం, బాధితుల కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. అనిల్, శ్రీకాంత్, రింకు సైనీ, లోకేష్ సింగ్లా, మోహిత్ వురపు మోను మానేసర్‌లను నిందితులుగా పేర్కొన్నారు. మృతుల్లో ఒకరు ఆవుల అక్రమ రవాణాకు పాల్పడేవారు. వీరి మరణానికి కారణం ఆవుల పరిరక్షణకు సంబంధించినదా? కాదా? అనే విషయం దర్యాప్తులో వెల్లడవుతుంది. ఎఫ్ఐఆర్‌లో పేర్కొన్నవారికి బజరంగ్ దళ్‌తో అనుబంధం ఉంది. కానీ వారు ఈ నేరానికి పాల్పడ్డారా? లేదా? దర్యాప్తులో తెలుస్తుంది.

రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ఈ దారుణాన్ని తీవ్రంగా ఖండించారు. దీనిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు.

ఇదిలావుండగా, ఈ కేసులో నిందితుడు మోను మానేసర్ ఓ టీవీ చానల్‌తో మాట్లాడుతూ, తనపై నమోదైన ఆరోపణలను తిరస్కరించారు. గోవధకు వ్యతిరేకంగా తాము ప్రచారం చేస్తున్నందువల్లే తమపై తప్పుడు కేసు బనాయించారన్నారు. ఈ కిడ్నాప్, హత్యతో బజరంగ్ దళ్ సభ్యులకు సంబంధం లేదన్నారు.

ఇవి కూడా చదవండి :

Ramcharitmanas Row : సమాజ్‌వాదీ పార్టీ బహిష్కృత నేత సంచలన వ్యాఖ్యలు

Karnataka : టిప్పు సుల్తాన్‌పై వ్యతిరేకత... బీజేపీలో భిన్నాభిప్రాయాలు...

Updated Date - 2023-02-17T20:06:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising