Rajasthan Elctions: రాజస్థాన్ ఎన్నికల తేదీ మార్చాలని ఈసీకి బీజేపీ లేఖ..!
ABN, First Publish Date - 2023-10-10T15:18:38+05:30
రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల తేదీని మార్చాల్సిందిగా ఎన్నికల కమిషన్‌కు బీజేపీ లేఖ రాయనుంది. షెడ్యూల్ ప్రకారం 200 అసెంబ్లీ స్థానాలున్న రాజస్థాన్‌లో నవంబర్ 23న ఎన్నికలు నిర్వహించనున్నట్టు ఈసీ సోమవారంనాడు ప్రకటించింది. డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు, ఫలితాల వెల్లడి ఉంటుంది.
జైపూర్: రాజస్థాన్ (Rajasthan) అసెంబ్లీ ఎన్నికల తేదీని మార్చాల్సిందిగా ఎన్నికల కమిషన్ (EC)కు బీజేపీ (BJP) లేఖ రాయనుంది. షెడ్యూల్ ప్రకారం 200 అసెంబ్లీ స్థానాలున్న రాజస్థాన్‌లో నవంబర్ 23న ఎన్నికలు నిర్వహించనున్నట్టు ఈసీ సోమవారంనాడు ప్రకటించింది. డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు, ఫలితాల వెల్లడి ఉంటుంది. అయితే, ఈతేదీ విషయంలో బీజేపీ తమ అభ్యంతరాలను తెలుపుతూ ఈసీకి లేఖ రాయనున్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి.
ఈసీ ప్రకటించిన నవంబర్ 23వ తేదీన కార్తీక శుద్ధ ఏకాదశి (దేవుత్తని ఏకాదశి) కావడం, విష్ణుమూర్తికి ప్రత్యేక పూజలు జరుపుకునే రోజు కావడం, అదేరోజు 45,000కు పైగా పెళ్లిళ్లు రాష్ట్రంలో జరుగనుండటంతో పోలింగ్ శాతంపై వీటి ప్రభావం పడుతుందని బీజేపీ అంటోంది. ఇందువల్ల వ్యాపార వర్గాలు సైతం ఓటింగ్‌కు హాజరయ్యే అవకాశం ఉండదని చెబుతోంది. పెళ్లిళ్లకు ఇప్పటికే వెడ్డింగ్ హాల్స్ బుక్ కావడంతో ఓటింగ్ శాతం తగ్గిపోయే అవకాశం ఉందని చెబుతోంది. ఇదే విషయాన్ని ఈసీ దృష్టికి తీసుకురానున్నట్టు బీజేపీ వర్గాలు తెలిపాయి.
మధ్యప్రదేశ్ వ్యాప్తంగా 51,756 పోలింగ్ బూత్‌లను ఈసీ ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించింది. రాష్ట్రంలో మొత్తం 5.27 కోట్ల మంది ఓటర్లు ఉండగా, వీరిలో 2.75 మంది పురుషులు, 2.51 కోట్ల మంది మహిళా ఓటర్లు ఉన్నారు. 18-19 ఏళ్ల మధ్య ఉన్న 22 లక్షల మంది తొలిసారిగా ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
Updated Date - 2023-10-10T15:19:28+05:30 IST