ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Robbery: రూ.5 లక్షల నగదును బ్యాంకులో డిపాజిట్ చేయడానికి బయటికి వచ్చాడు.. కానీ ఇంతలోనే..

ABN, First Publish Date - 2023-09-21T10:39:32+05:30

పెట్రోల్ బంక్ ఉద్యోగి నుంచి గుర్తు తెలియని వ్యక్తులు రూ.5 లక్షలు దోచుకున్న ఘటన రాజస్థాన్‌లోని భిల్వారాలో చోటుచేసుకుంది. ఈ ఘటన సోమవారం జరిగింది.

జైపూర్: పెట్రోల్ బంక్ ఉద్యోగి నుంచి గుర్తు తెలియని వ్యక్తులు రూ.5 లక్షలు దోచుకున్న ఘటన రాజస్థాన్‌లోని భిల్వారాలో చోటుచేసుకుంది. ఈ ఘటన సోమవారం జరిగింది. భిల్వారా జిల్లాలో ఉన్న పెంట్రోల్ బంక్‌లో మహేంద్ర గుర్జార్ అనే ఉద్యోగి పని చేస్తున్నాడు. సోమవారం నాడు పెట్రోల్ బంక్‌కు సంబంధించిన రూ.5 లక్షల నగదును బ్యాంకులో డిపాజిట్ చేయడానికి బ్యాంకుకు వెళ్తున్నాడు. మహేంద్ర గుర్జార్ బంక్ నుంచి బయటికి రాగానే ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు అతన్ని ఆపి, బెదిరించారు. డబ్బు ఉన్న బ్యాగును లాక్కొని అక్కడి నుంచి పారిపోయారు. వారిలో ఒకరి మోహం గుడ్డతో కప్పి ఉంది. దొంగలను పట్టుకోవడానికి గుర్జర్ 5 కిలో మీటర్ల మేర వెంబండించాడు. కానీ వాళ్లు తప్పించుకున్నారు. దీంతో గుర్జార్ వెంటనే పోలీసులను ఆశ్రయించాడు. గుర్జార్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ఘటన జరిగిన సమీపంలో ఉన్న సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. భిల్వారా, షాపురా జిల్లాల మధ్య ఉన్న సరిహద్దులో చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు.

Updated Date - 2023-09-21T10:39:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising