ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

RSS March: సుప్రీంకోర్టు గ్రీన్‌సిగ్నల్..స్టాలిన్‌కు చెక్కెదురు..

ABN, First Publish Date - 2023-04-11T13:04:05+05:30

తమిళనాడులో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ర్యాలీలు నిర్వహించుకునేందుకు మార్గం సుగమమైంది. రాష్ట్రంలో..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

న్యూఢిల్లీ: తమిళనాడులో (Tamilnadu) రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (RSS) ర్యాలీలు నిర్వహించుకునేందుకు మార్గం సుగమమైంది. రాష్ట్రంలో ఆర్ఎఎస్ఎస్ ర్యాలీలపై మద్రాసు హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ ఎంకే స్టాలిన్ (MK Stalin) ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్ వి.రామసుబ్రమణియన్, పంజక్ మిథాల్‌తో కూడిన సుప్రీంకోర్టు (Supreme Court) ధర్మాసనం కొట్టివేసింది.

స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు కావడం, గాంధీ జయంతిని పురస్కరించుకుని ర్యాలీలు నిర్వహించేందుకు అనుమతించాలని గత ఏడాది అక్టోబర్‌లో తమిళనాడు ప్రభుత్వాన్ని ఆర్ఎస్ఎస్ కోరింది. అయితే, నిషేధిత 'పాపులర్ ఫ్రంట్ ఆప్ ఇండియా' నుంచి దాడుల ముప్పు ఉందంటూ ఈ ర్యాలీలకు తమిళనాడు ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. దీంతో మద్రాసు హైకోర్టును ఆర్ఎస్ఎస్ ఆశ్రయించింది. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు గత ఏడాది నవంబర్‌లో కొన్ని షరతులపై ఆర్ఎస్ఎస్ ర్యాలీలకు అనుమతి ఇచ్చింది. అయితే దీనిపై కూడా ఆర్ఎస్ఎస్ డివిజన్ బెంచ్‌కు వెళ్లడంతో ఎలాంటి షరతులు లేకుండా ర్యాలీలు నిర్వహించుకునేందుకు అనుమతిస్తూ డివిజన్ బెంచ్ ఈ ఏడాది ఫ్రిబవరి 10న తీర్పు చెప్పింది. దీనిపై స్టాలిన్ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లింది. ర్యాలీలను పూర్తిగా తాము వ్యతిరేకించడం లేదని, నిఘావర్గాల హెచ్చరికలతోనే వీధివీధిన ర్యాలీలకు అనుమతించడం లేదని చెప్పింది. దీనిపై విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం.. మద్రాసు హైకోర్టు తీర్పును సమర్ధిస్తూ స్టాలిన్ సర్కార్ పిటిషన్‌ను మంగళవారంనాడు కొట్టివేసింది. దీంతో తమిళనాడులో ఆర్ఎస్ఎస్ ర్యాలీలు నిర్వహించేందుకు మార్గం సుగమమైంది.

Updated Date - 2023-04-11T13:29:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising