Russia : పాశ్చాత్య దేశాలు నాజీయిజం నిజ రూపాన్ని సృష్టిస్తున్నాయి : పుతిన్
ABN, First Publish Date - 2023-05-09T15:42:16+05:30
నాజీయిజం నిజ రూపాన్ని పాశ్చాత్య దేశాలు సృష్టిస్తున్నాయని రష్యా అధ్యక్షుడు వ్లదిమిర్ పుతిన్ (Russian President Vladimir Putin) ఆరోపించారు.
మాస్కో : నాజీయిజం నిజ రూపాన్ని పాశ్చాత్య దేశాలు సృష్టిస్తున్నాయని రష్యా అధ్యక్షుడు వ్లదిమిర్ పుతిన్ (Russian President Vladimir Putin) ఆరోపించారు. ‘‘మన మాతృభూమికి వ్యతిరేకంగా నిజమైన యుద్ధం ప్రారంభమైంది’’ అని చెప్పారు. నేటి ప్రపంచం నిశ్చయాత్మకమైన మలుపులో ఉందన్నారు. రెండో ప్రపంచ యుద్ధంలో నాజీ జర్మనీపై విజయం సాధించినందుకు ప్రతి సంవత్సరం నిర్వహించే విజయోత్సవాల సందర్భంగా ఆయన మంగళవారం మాట్లాడారు.
రెండో ప్రపంచ యుద్ధంలో రష్యా సాధించిన ఫలితాలను రద్దు చేయడానికి పాశ్చాత్య దేశాలు ప్రయత్నిస్తున్నాయన్నారు. మన మాతృభూమికి వ్యతిరేకంగా నిజమైన యుద్ధం ప్రారంభమైందన్నారు. ఉక్రెయిన్ సంక్షోభానికి కారణం పాశ్చాత్య దేశాల నియంత్రణ లేని దురాశ, దురహంకారం, చేసిన తప్పుకు శిక్ష లేకపోవడమేనని చెప్పారు. విజయోత్సవ కవాతులో పాల్గొన్న సైనికులకు పుతిన్ స్వాగతం పలికారు. ఉక్రెయిన్‌తో యుద్ధంలో పాల్గొన్న రష్యన్ సైనికులు కూడా ఈ కవాతులో పాల్గొన్నారు. ‘‘మన సాహసోపేత సాయుధ దళాలకు విజయోత్సవాలకు స్వాగతం’’ అని పుతిన్ అన్నారు.
ఉక్రెయిన్-రష్యా యుద్ధం దాదాపు 14 నెలల నుంచి జరుగుతోంది. ఇది పాశ్చాత్య దేశాలతో ప్రచ్ఛన్న యుద్ధం అని పుతిన్ చాలాసార్లు చెప్తున్నారు. ఇది తమ అస్థిత్వం కోసం జరుపుతున్న పోరాటమని రష్యా చెప్తోంది. తమ దేశాన్ని నాశనం చేయడానికి ఉక్రెయిన్‌ను ఓ ఉపకరణంగా పాశ్చాత్య దేశాలు వాడుకుంటున్నాయని రష్యా ఆరోపిస్తోంది.
ఇదిలావుండగా, ఉక్రెయిన్ ఎయిర్ ఫోర్స్ ఓ ప్రకటనలో తెలిపిన వివరాల ప్రకారం, రష్యా 25 మిసైల్స్‌ను సోమవారం రాత్రి ప్రయోగించింది. వీటిలో 23 మిసైల్స్‌ను ఉక్రెయిన్ దళాలు ధ్వంసం చేశాయి.
ఇవి కూడా చదవండి :
Sachin Pilot: గెహ్లాట్ లీడర్ సోనియా కాదు, వసుంధరా రాజే..
Indian Army : సైన్యంలో యూనిఫాం సంస్కరణలు
Updated Date - 2023-05-09T15:42:16+05:30 IST