ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

India and Russia : భారత్, రష్యా కలిసికట్టుగా సర్వతోముఖాభివృద్ధి : పుతిన్

ABN, First Publish Date - 2023-01-26T17:11:26+05:30

ప్రపంచం సుస్థిరంగా ఉండేందుకు, ప్రాంతీయ, అంతర్జాతీయ ఎజెండాలోని ముఖ్యమైన సమస్యలను

Vladimir Putin
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : రష్యా అధ్యక్షుడు వ్లదిమిర్ పుతిన్ (Vladimir Putin) గురువారం గణతంత్ర దినోత్సవాల సందర్భంగా భారత దేశానికి శుభాకాంక్షలు తెలిపారు. ఇరు దేశాలు కలిసికట్టుగా కృషి చేస్తూ సర్వతోముఖాభివృద్ధి సాధించగలవనే నమ్మకం తనకు ఉందన్నారు. ఆర్థిక, సాంఘిక, శాస్త్రీయ, తదితర రంగాల్లో భారత్ సాధించిన విజయాలు అందరికీ తెలుసునన్నారు.

ప్రపంచం సుస్థిరంగా ఉండేందుకు, ప్రాంతీయ, అంతర్జాతీయ ఎజెండాలోని ముఖ్యమైన సమస్యలను పరిష్కరించేందుకు భారత దేశం విశేషంగా క‌ృషి చేస్తోందని చెప్పారు. ఇరు దేశాలు కలిసికట్టుగా కృషి చేస్తూ అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చెందగలమనే నమ్మకం తనకు ఉందన్నారు. ఉభయ దేశాలకు ప్రయోజనకరమైన ద్వైపాక్షిక సహకార వృద్ధిని సాధించగలమని తెలిపారు. దీనివల్ల భారత్, రష్యాలలోని స్నేహపూర్వక ప్రజల మౌలిక ప్రయోజనాలు నెరవేరుతాయనడంలో సందేహం లేదని తెలిపారు.

బ్రిటన్ ఫారిన్ సెక్రటరీ జేమ్స్ క్లెవర్లీ కూడా భారత దేశానికి, విదేశాంగ మంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్‌కు, భారతీయులకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

Updated Date - 2023-01-26T17:11:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising