Raisina Dialogue 2023: ఛాన్స్ ఇస్తే వికెట్ తీయాలనుకుంటున్న ప్రధాని మోదీ!

ABN, First Publish Date - 2023-03-03T17:48:09+05:30

కెప్టెన్ మోడీ నేతృత్వంలో ఉదయం ఆరు గంటలకే నెట్ ప్రాక్టీస్ మొదలై రాత్రిదాకా కొనసాగుతోందని జై శంకర్ సరదాగా వ్యాఖ్యానించారు.

Raisina Dialogue 2023: ఛాన్స్ ఇస్తే వికెట్ తీయాలనుకుంటున్న ప్రధాని మోదీ!
Raisina Dialogue 2023
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

న్యూఢిల్లీ: దేశ రాజధాని న్యూఢిల్లీలో అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్ సహకారంతో విదేశాంగ శాఖ నిర్వహించిన రైసినా డైలాగ్ 2023(Raisina Dialogue 2023) కార్యక్రమంలో విదేశాంగ మంత్రి ఎస్ జై శంకర్(EAM Dr S Jaishankar) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్(Former UK PM Tony Blair), ఇంగ్లాండ్ క్రికెటర్ కెవిన్ పీటర్సన్(Kevin Peter Pietersen) వేదికపై ఉండగా యాంకర్ అడిగిన ప్రశ్నకు జై శంకర్ సమాధానమిచ్చారు. బ్రిటన్‌(Britain)ను దాటి భారత్ ఐదో అతిపెద్ద ఆర్ధిక శక్తిగా ఎదగడంతో పాటు క్రెకెట్‌లో కూడా డామినేట్ చేస్తుండటాన్ని ఎలా చూడాలని యాంకర్ అడిగారు. దీనికి సమాధానంగా ఎస్ జైశంకర్ మాట్లాడుతూ ప్రస్తుత తరుణం రీ బ్యాలన్స్ చేయడం లాంటిదన్నారు. మిగతా దేశాలు సాధించలేని చారిత్రక సన్నివేశంలోకి భారత్ ప్రవేశించిందన్నారు. అంతర్జాతీయంగా భారత ప్రతిష్ట పెరిగిపోతుండటంపై వ్యాఖ్యానిస్తూ క్రికెట్‌‌(Cricket )లో మాదిరిగానే కేవలం భారత్‌లోనే విజయాలు సాధించడం కాకుండా ఇతర దేశాల్లో కూడా భారత్ విజయం సాధిస్తున్నట్లుగా అని ఉదహరించారు. కెప్టెన్ మోడీ(Captain PM Modi) నేతృత్వంలో ఉదయం ఆరు గంటలకే నెట్ ప్రాక్టీస్ మొదలై రాత్రిదాకా కొనసాగుతోందని జై శంకర్ సరదాగా వ్యాఖ్యానించారు. ఛాన్స్ ఇస్తే వికెట్ తీయాలని ప్రధాని ఆశిస్తారని జై శంకర్ చెప్పారు.

ఇదే వేదికపై బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్ మాట్లాడుతూ ఐక్యరాజ్యసమితి భద్రతామండలి(UNSC)లో భారత్‌కు ఛాన్స్ దక్కకపోవడంపై స్పందించారు. పశ్చిమదేశాలకు అధికారం పంచుకోవడం తప్ప మరో మార్గం లేదన్నారు. గతంలో కన్నా భారత్ శరవేగంగా అభివృద్ధి చెందుతూ ప్రస్తుతం అత్యంత శక్తిమంతమైన స్థానంలో ఉందని టోనీ బ్లెయిర్ కితాబునిచ్చారు.

Updated Date - 2023-03-03T18:07:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!