ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Supreme Court: నెలాఖరు వరకూ పవన్ ఖేరాను అరెస్ట్ చేయొద్దు

ABN, First Publish Date - 2023-02-23T18:26:45+05:30

కాంగ్రెస్ నేత పవన్ ఖేరా (Pawan Khera)కు సుప్రీంకోర్టు (Supreme Court) ఊరటనిచ్చింది.

SC directs Dwarka court to grant interim relief to Khera
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: కాంగ్రెస్ నేత పవన్ ఖేరా (Pawan Khera)కు సుప్రీంకోర్టు (Supreme Court) ఊరటనిచ్చింది. ఆయన్ను ఈ నెలాఖరు వరకూ అరెస్ట్ చేయరాదని తేల్చి చెప్పింది. సుప్రీంకోర్ట్ ఆదేశాల మేరకు ఢిల్లీ ద్వారకా కోర్టు ఆయనకు 30 వేల రూపాయల పూచీకత్తుపై బెయిల్ మంజూరు చేసింది. మోదీ తండ్రిని దామోదర్ దాస్ మూల్‌చంద్ మోదీ (Damodardas Mulchand Modi) అనకుండా గౌతమ్ దాస్ మోదీ(Gautam Das Modi) అని వ్యాఖ్యానించడంతో పవన్ ఖేరాపై అనేక చోట్ల కేసులు నమోదయ్యాయి. దీంతో తనపై నమోదైన అన్ని కేసులను ఒకే చోట విచారించేలా ఆదేశాలు జారీ చేయాలని ఆయన దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు గురువారం మధ్యాహ్నం విచారణ జరిపింది. తనను అరెస్ట్ చేయకుండా రక్షణ కల్పించాలని ఆయన అత్యున్నత న్యాయస్థానాన్ని కోరడంతో న్యాయమూర్తులు ఆయనకు ఊరట నిచ్చారు. ఈ నెల 28 వరకూ పవన్ ఖేరాను అరెస్ట్ చేయరాదని సూచించారు.

పవన్ ఖేరా శుక్రవారం ముంబైలో విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇంటిపేరును, ఆయన తండ్రిని అవమానిస్తూ మాట్లాడారు. ‘‘ప్రధాని నరసింహా రావు సంయుక్త పార్లమెంటరీ కమిటీ (JPC)ని ఏర్పాటు చేయగలిగినపుడు, అటల్ బిహారీ వాజ్‌పాయి జేపీసీని ఏర్పాటు చేయగలిగినపుడు, నరేంద్ర గౌతమ్ దాస్, సారీ, దామోదర్‌దాస్ మోదీకి వచ్చిన సమస్య ఏమిటి’’ అని పవన్ ఖేరా అన్నారు. దీనిపై దుమారం రేగింది.

అదానీ గ్రూప్ స్టాక్ మేనిపులేషన్‌కు పాల్పడుతోందని హిండెన్‌బర్గ్ నివేదిక ఆరోపించిన నేపథ్యంలో సంయుక్త పార్లమెంటరీ కమిటీ చేత విచారణ జరిపించాలని ఈ విలేకర్ల సమావేశంలో ఖేరా డిమాండ్ చేశారు.

ఈ నేపథ్యంలో అస్సాంలో పవన్ ఖేరాపై కేసు నమోదైంది. కాంగ్రెస్ నేత సుప్రియ సునాటే మీడియాతో మాట్లాడుతూ, తమ పార్టీ సీనియర్ నేత పవన్ ఖేరా రాయ్‌పూర్‌లో జరిగే ప్లీనరీ సమావేశాలకు హాజరయ్యేందుకు వెళ్తున్నారని, ఆయనతోపాటు తమ పార్టీ నేత రణదీప్ సింగ్ సుర్జేవాలా కూడా ఉన్నారని తెలిపారు. పవన్ ఖేరాను అస్సాం పోలీసులు అరెస్ట్ చేస్తున్నారని, అనేక దురాగతాలు జరుగుతున్నా ఇదే అస్సాం పోలీసులు పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు. ఖేరాను అదుపులోకి తీసుకోవడానికి కారణమేమిటో చెప్పాలని డిమాండ్ చేశారు. ఇది నియంతృత్వం కాదా? అని, ఖేరా చేసిన తప్పు ఏమిటని ప్రశ్నించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై నోరు జారి ఏదో మాట్లాడినందుకు అరెస్టు చేస్తున్నారా? అని ప్రశ్నించారు. అలా అయితే మొదట మోదీని అరెస్టు చేయాలన్నారు. నెహ్రూ ఇంటిపేరును ఎందుకు వాడటం లేదని మోదీ ప్రశ్నించారన్నారు. తనను అస్సాం పోలీసులు తీసుకెళ్తుండగా ఖేరా మాట్లాడుతూ, ఇది సుదీర్ఘ పోరాటమని, తాము పోరాడటానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు.

రణదీప్ సుర్జేవాలా మాట్లాడుతూ, వారంట్ లేకుండా పవన్ ఖేరాను అస్సాం పోలీసులు అరెస్టు చేశారన్నారు. ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ఆదేశాల మేరకు తాము అరెస్టు చేస్తున్నామని చెప్పారన్నారు. హిమంత అంటే భగవంతుడా? అని ప్రశ్నించారు.

ఢిల్లీ, అస్సాం రాష్ట్రాల పోలీసులు పవన్ ఖేరాను విమానం నుంచి దించినట్లు తెలుసుకున్న కాంగ్రెస్ కార్యకర్తలు ఢిల్లీ విమానాశ్రయంలో నిరసన తెలిపారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

అస్సాం పోలీసులు ఓ వార్తా సంస్థతో మాట్లాడుతూ, హఫ్లాంగ్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసులో పవన్ ఖేరాను అరెస్టు చేసినట్లు చెప్పారు.

మరోవైపు ఏఐసీసీ ప్లీనరీ కోసం రాయ్‌పూర్ చేరుకున్న కాంగ్రెస్ నేతలంతా కేంద్ర ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. పవన్ ఖేరాతో అన్యాయంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. పవన్ ఖేరాను అరెస్ట్ చేయవద్దని సుప్రీంకోర్టు కేంద్రానికి గట్టిగా బుద్ధి చెప్పిందని కాంగ్రెస్ సీనియర్ నేతలు వ్యాఖ్యానించారు.

ఇటు పవన్ ఖేరాను ఢిల్లీ విమానాశ్రయంలో ఇండిగో విమానం ఎక్కకుండా అధికారులు అడ్డుకున్నారు. లగేజీకి సంబంధించి సమస్య ఉందని మీడియా ప్రతినిధులకు చెప్పారు.

Updated Date - 2023-02-23T22:30:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising