Bharat Jodo Yatra : ఆ రాష్ట్రంపై ప్రత్యేక దృష్టితో మరోసారి రాహుల్ గాంధీ ‘భారత్ జోడో యాత్ర’
ABN, First Publish Date - 2023-07-29T11:04:18+05:30
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ రెండో విడత భారత్ జోడో యాత్ర చేయబోతున్నారు. ఇది ఎప్పటి నుంచి ప్రారంభమవుతుందో ఇంకా ఖరారు కాలేదు.
లక్నో : కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) రెండో విడత భారత్ జోడో యాత్ర చేయబోతున్నారు. ఇది ఎప్పటి నుంచి ప్రారంభమవుతుందో ఇంకా ఖరారు కాలేదు. అయితే ఉత్తర ప్రదేశ్‌పై ప్రత్యేక దృష్టి పెట్టబోతున్నారు. 2024 లోక్ సభ ఎన్నికల్లో పార్టీ విజయావకాశాల మెరుగుదలకు దోహదపడే విధంగా ఎక్కువ జిల్లాల్లో ఎక్కువ మంది ప్రజలను కలవబోతున్నారు.
ఉత్తర ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం, రాహుల్ గాంధీ రెండో విడత భారత్ జోడో యాత్ర స్వాతంత్ర్య దినోత్సవం (ఆగస్టు 15) నుంచి లేదా గాంధీ జయంతి (అక్టోబరు 2) నుంచి ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. రానున్న లోక్ సభ ఎన్నికల్లో పార్టీకి మేలు జరిగే విధంగా ఉత్తర ప్రదేశ్‌లోని అత్యధిక జిల్లాల్లో ఈ యాత్ర జరగవచ్చు. గుజరాత్‌లోని పోర్‌బందర్ నుంచి త్రిపుర రాజధాని నగరం అగర్తల వరకు ఈ యాత్ర జరుగుతుంది.
ఉత్తర ప్రదేశ్‌కు చెందిన ఓ సీనియర్ కాంగ్రెస్ నేత మీడియాతో మాట్లాడుతూ, రానున్న లోక్ సభ ఎన్నికల దృష్ట్యా ఉత్తర ప్రదేశ్ చాలా కీలకమైన రాష్ట్రమని, ఈ రాష్ట్రంలోని ఎక్కువ జిల్లాల్లో భారత్ జోడో యాత్ర చేయాలని రాహుల్ గాంధీని కోరామని చెప్పారు.
తొలి విడత భారత్ జోడో యాత్ర సెప్టెంబరు 7న తమిళనాడులోని కన్యా కుమారి నుంచి ప్రారంభమైంది. 136 రోజుల పాటు జరిగిన ఈ యాత్ర జమ్మూ-కశ్మీరులో ముగిసింది. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ ఉత్తర ప్రదేశ్‌లోని ఘజియాబాద్, బాగ్‌పట్, షామ్లి జిల్లాల్లో పర్యటించారు.
ఇవి కూడా చదవండి :
Chennai: బోసినవ్వుల బామ్మ ఇకలేరు
Manipur : మణిపూర్ బయల్దేరిన ప్రతిపక్ష ఇండియా కూటమి ఎంపీలు
Updated Date - 2023-07-29T11:04:18+05:30 IST