ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Shashi Tharoor: ఎస్ జైశంకర్‌కు శశిథరూర్ సలహా

ABN, First Publish Date - 2023-04-03T22:38:54+05:30

భారత విదేశాంగ మంత్రి ఎస్ జై శంకర్‌కు (External Affairs Minister S Jaishankar) కాంగ్రెస్ ఎంపీ (Congress MP) శశిథరూర్ (Shashi Tharoor) సలహా ఇచ్చారు.

Shashi Tharoor Jaishankar
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

న్యూఢిల్లీ: భారత విదేశాంగ మంత్రి ఎస్ జై శంకర్‌కు (External Affairs Minister S Jaishankar) కాంగ్రెస్ ఎంపీ (Congress MP) శశిథరూర్ (Shashi Tharoor) సలహా ఇచ్చారు. ఇతర దేశాలపై స్పందించేటప్పుడు కూల్‌గా ఉండాలని సూచించారు. జై శంకర్ తనకు చాలా కాలంగా తెలుసని, ఆయన్ను స్నేహితుడిగా భావిస్తానని చెప్పారు. విమర్శల విషయంలో అంత నొచ్చుకోవాల్సిన అవసరం లేదని, ఒక ప్రభుత్వంగా అలాంటి విషయాల్లో సున్నితంగా వ్యవహరించడం ముఖ్యమన్నారు. ప్రతిదానికీ స్పందిస్తూ పోతే మనకు మనమే హాని చేసుకున్నవారమవుతామని, కాస్త శాంతించాలని జై శంకర్‌కు థరూర్ సూచించారు.

అంతకు ముందు కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ అనర్హతపై అమెరికా(USA), జర్మనీ(Germany) దేశాలు కామెంట్ చేయడంపై భారత విదేశాంగ మంత్రి ఎస్ జై శంకర్ (External Affairs Minister S Jaishankar) కన్నెర్ర చేశారు. పశ్చిమదేశాలకు(West) ఇతరులపై కామెంట్ చేసే దురలవాటు ఉందంటూ చురకలంటించారు. బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య బెంగళూరులో నిర్వహించిన మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో ఎస్ జైశంకర్ విలేకరులతో మాట్లాడుతూ పాశ్చాత్య దేశాల తీరును ఎండగట్టారు. అదే సమయంలో లండన్, కెనెడా, ఆస్ట్రేలియా, శాన్‌ఫ్రాన్సిస్కో తదితర ప్రాంతాల్లో భారతీయ జెండాను దించేసి ఖలిస్థానీ మద్దతుదారులు ఖలిస్థాన్( Khalistani) జెండాను పెట్టడంపై జైశంకర్ మండిపడ్డారు. ఇలాంటి ఘటనలు చూస్తూ ఊరుకోబోమన్నారు. 2020లో కోవిడ్ సమయంలో సరిహద్దుల వద్ద భారత సైన్యాన్ని, ఎయిర్‌ఫోర్స్ బలగాలను మోహరించారని, సమస్య పరిష్కారమయ్యే వరకూ అవి అలాగే కొనసాగుతాయన్నారు.

Updated Date - 2023-04-03T22:38:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising