ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బీజేపీకి షాక్.. కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకున్న మాజీ మంత్రి

ABN, First Publish Date - 2023-04-21T10:41:08+05:30

మాజీమంత్రి ఒకరు భారతీయ జనతా పార్టీకి షాక్ ఇచ్చారు. ఆయన బీజేపీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- ‘సబ్‌కా సాథ్‌ సబ్‌కా వికాస్‌’ వట్టి బూటకం

బెంగళూరు, (ఆంధ్రజ్యోతి): బీజేపీకి రాజీనామా చేసిన మాజీమంత్రి ప్రముఖ దళిత నేత బి.సోమశేఖర్‌(B. Somasekhar) కాంగ్రెస్‌ తీర్ధం పుచ్చుకున్నారు. కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌ సారథ్యంలో నగరంలో కేపీసీసీ కార్యాలయంలో ఆయన కాంగ్రెస్‏లో చేరిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ బీజేపీ ఇటీవల ప్రకటించిన రిజర్వేషన్లు రాజకీయ గిమ్మిక్కు అని అభివర్ణించారు. రిజర్వేషన్ల పెంపు పై సుప్రీంకోర్టులో ప్రభుత్వం ఇంతవరకు అఫిడవిట్‌ వేయలేదని ఈ రిజర్వేషన్లు ప్రస్తుతానికైతే కాగితాలకే పరిమితమని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర వక్ఫ్‌బోర్డు అధ్యక్షుడు ఆసిఫ్‌ సేఠ్‌ కూడా తన పదవికి రాజీనామా చేసి కాంగ్రె్‌సలో చేరిపోయారు. బీజేపీ ప్రభుత్వంలో మైనార్టీలను నానా విధాలుగా ఇబ్బందులకు గురిచేశారని ఆయన ఆరోపించారు. బీజేపీ చెప్పే ‘సబ్‌కా సాథ్‌ సబ్‌కా వికాస్‌’ వట్టి బూటకమన్నారు. అలాగైతే శాసనసభ ఎన్నిల్లో కనీసం ఒక ముస్లిం మైనార్టీకి కూడా టికెట్‌ ఎందుకు ఇవ్వలేదని ఆయన ప్రశ్నించారు. ఇదే సందర్భంగా జేడీఎస్‌(JDS) నేత మూడా మాజీ అధ్యక్షుడు బసవేగౌడ, మైనార్టీనేత అబ్దుల్‌ అజీజ్‌ కూడా కాంగ్రెస్‏లో చేరారు.

Updated Date - 2023-04-21T12:06:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising