ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Ukrain వైద్య విద్యార్థులకు షాక్.. దేశంలోని మెడికల్ కాలేజీల్లో చేర్చుకోబోమని తేల్చి చెప్పిన కేంద్రం..

ABN, First Publish Date - 2023-02-22T13:14:40+05:30

ఉక్రెయిన్ నుంచి వచ్చిన విద్యార్థులకు ఎలాంటి నష్టమూ కలగనివ్వబోమని.. అన్ని విధాలుగా ఆదుకుంటామని చెప్పిన కేంద్రం తాజాగా చేతులెత్తేసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఢిల్లీ : ఉక్రెయిన్ (Ukraine) నుంచి వచ్చిన విద్యార్థులకు ఎలాంటి నష్టమూ కలగనివ్వబోమని.. అన్ని విధాలుగా ఆదుకుంటామని చెప్పిన కేంద్రం తాజాగా చేతులెత్తేసింది. బీఆర్ఎస్ ఎంపీ బీబీ పాటిల్‌ (BRS MP BB Patil)కు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డా. మన్‌సుఖ్ మాండవియా ఈ మేరకు లేఖ రాశారు. 2022 డిసెంబర్ 13న లోక్‌సభ జీరో అవర్‌లో ఉక్రెయిన్‌లో చదువుకుంటున్న భారతీయ వైద్య విద్యార్థుల సమస్యల గురించి బీబీ పాటిల్ మాట్లాడారు. బీబీ పాటిల్ లేవనెత్తిన అంశాలకు కేంద్ర మంత్రి లేఖలో పూర్తి సమాచారం ఇచ్చారు.

కేంద్ర మంత్రి ఇచ్చిన లేఖ సారాంశం ఏంటంటే..

విదేశాల్లో చదువుకున్న వైద్య విద్యార్థులకు దేశంలోని మెడికల్ కాలేజీల్లో చేర్చుకోడానికి అవకాశం లేదు. ఇండియన్ మెడికల్ కౌన్సిల్ చట్టం -1956, నేషనల్ మెడికల్ కమిషన్ యాక్ట్ - 2019లో ఆ తరహా అవకాశం కల్పించలేదు. అయితే సుప్రీంకోర్టు గత ఏడాది జులైలో ఇచ్చిన తీర్పు ప్రకారం కోవిడ్-19, ఉక్రెయిన్-రష్యా యుద్ధం కారణంగా తమ వైద్య విద్యను కొనసాగించలేకపోయిన చివరి సంవత్సరం విద్యార్థులకు మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామినేషన్ పరీక్ష రాయడానికి అనుమతిస్తున్నాం. ఆ పరీక్షలో క్వాలిఫై అయిన వైద్య విద్యార్థులు తప్పనిసరిగా రెండేళ్ల పాటు మెడికల్ ఇంటర్న్‌షిప్ చేయాల్సి ఉంటుంది. ఈ ఇంటర్న్‌షిప్ పూర్తయిన తర్వాత మాత్రమే ఆ వైద్య విద్యార్థులు రిజిస్ట్రేషన్ పొందగలరు. ఉక్రెయిన్ యుద్ధం కారణంగా వైద్య విద్యను మధ్యలోనే వదులుకున్న విద్యార్థులు 29 దేశాల్లో ఎక్కడైనా కొనసాగించుకునే వెసులుబాటు కల్పిస్తూ నేషనల్ మెడికల్ కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసింది.

ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం నేపథ్యంలో అక్కడ చదువుతున్న వేలాది మంది భారతీయ విద్యార్థులను కేంద్ర ప్రభుత్వం పూనుకుని స్వదేశానికి తీసుకుని వచ్చిన సంగతి తెలిసిందే. దాదాపు 22 వేల మంది విద్యార్థులలో ఎక్కువ శాతం మంది వైద్య విద్యను అభ్యసించేందుకు ఉక్రెయిన్ వెళ్లారు. భారత్‌లో కంటే ఉక్రెయిన్‌లో వైద్య విద్యకు తక్కువ వ్యయం అవుతుండటంతో వైద్య విద్యను అభ్యసించాలనుకున్న వారు ఆ దేశానికి వెళ్లారు.అయితే ఉక్రెయిన్ - రష్యా యుద్ధం వారి ఆశలపై నీళ్లు చల్లింది. దీంతో అక్కడ చిక్కుకుపోయిన విద్యార్థులను భారత్ ప్రభుత్వం విమానాల్లో సురక్షితంగా ఇండియాకు తీసుకొచ్చింది. ఆ సమయంలోనే వారికి ఎలాంటి ఇబ్బంది కలగనివ్వబోమని ప్రభుత్వం తెలిపింది. కానీ నేటి కేంద్రం లేఖ ఉక్రెయిన్ నుంచి వచ్చిన విద్యార్థుల్లో నిరాశను నింపేదిగా ఉంది.

Updated Date - 2023-02-22T13:24:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising