ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Siddaramaiah: సావర్కర్‌, మోదీపై సంచలన వ్యాఖ్యలు

ABN, First Publish Date - 2023-01-23T17:35:09+05:30

వీర్ దామోదర్ సావర్కర్‌‌పై కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత సిద్ధరామయ్య మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బెంగళూరు: వీర్ దామోదర్ సావర్కర్‌ (Veer Damodar Savarkar)పై కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత సిద్ధరామయ్య (Siddaramaiah) మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బీజేపీ నాయకత్వంపైనా విమర్శలు గుప్పించారు. సావర్కర్‌కు జర్మన్ నియంత అడాల్ఫ్ హిట్లర్ (Adolf Hitler) స్ఫూర్తి అని అన్నారు.

''దక్షిణ కన్నడ ప్రాంతాన్ని హిందుత్వ లేబొరేటరిగా మార్చాలని బీజేపీ అనుకుంటోంది. వాళ్ల ఏకైక వృత్తి అబద్ధాలు ఆడటం. సావర్కర్‌కు ఎవరు స్ఫూర్తో తెలుసా? హిట్లర్ ఫిలాసఫీ. హిందుత్వను ప్రారంభించింది ఎవరో తెలుసా? సావర్కర్ హిందూ మహాసభ'' అని మీడియాతో మాట్లాడుతూ సిద్ధరామయ్య చెప్పారు. బీజేపీ నాయకత్వాన్ని కూడా హిట్లర్‌తోనూ, ఇతర నియంతలతోనూ సిద్ధారామయ్య పోల్చారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, హిట్లర్, ముస్సోలిని మధ్య పోలికలను ఆయన వివరిస్తూ, బీజేపీకి ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని అన్నారు.''ఆయన ప్రధాని. ఆయనను రానీయండి. మాకు ఎలాంటి ఇబ్బందీ లేదు. కానీ, ఆయన వందసార్లు బీజేపీ అధికారంలోకి వస్తుందని చెబితే మాత్రం, అదెప్పటికీ జరగదని నేను చాలా స్పష్టంగా చెప్పదలచుకున్నాను. ప్రజలు కూడా నమ్మరు. హిట్లర్‌కు ఏమి జరిగింది? కొద్ది రోజులుగా ఆడంబరంగా తిరిగారు. ముస్సోలిని, ఫ్రాన్కో విషయంలో ఏమి జరిగింది? ఆయనది (మోదీ) కూడా ఇలాగే కొద్ది రోజుల ఆడంబరమే'' అని సిద్ధరామయ్య అన్నారు.

పీఎంపై ఇంత దిగజారుడు వ్యాఖ్యలా?: బొమ్మై

ప్రధానమంత్రి నరేంద్ర మోదీని జర్మన్ నియంత అడాల్ఫ్ హిట్లర్‌తో సిద్ధరామయ్య పోల్చడంపై ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై ఆక్షేపణ వ్యక్తం చేశారు. ఇలాంటి దిగజారుడు వ్యాఖ్యలు కర్ణాటక సంస్కృతి కాదని అన్నారు. మోదీ వ్యక్తిత్వం ఏమిటనేది దేశంలోని 130 కోట్ల మంది జనాభాకు తెలుసునని, గుజరాత్ ఎన్నికల్లోనూ ప్రధానిపై ఇలాంటి వ్యాఖ్యలే చేశారని, ఏమాత్రం ఫలితాలు సాధించారో అందరికీ తెలిసిందేనని అన్నారు. వ్యక్తిగత విమర్శలు చేయడం మాజీ ముఖ్యమంత్రి హోదాకు తగదని హితవు పలికారు.

Updated Date - 2023-01-23T17:40:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising