Sitaram Echuri: అసలు విషయం చెప్పేశారు.. ఆ కూటమిలో చేరే ప్రసక్తేలేదు..
ABN, First Publish Date - 2023-12-02T07:48:41+05:30
రానున్న లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలోని డీఎంకే కూటమిలోనే సీపీఎం కొనసాగుతుందని, అన్నాడీఎంకే కూటమిలో చేరే ప్రసక్తే లేదని ఆ పార్టీ జాతీయ
చెన్నై, (ఆంధ్రజ్యోతి): రానున్న లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలోని డీఎంకే కూటమిలోనే సీపీఎం కొనసాగుతుందని, అన్నాడీఎంకే కూటమిలో చేరే ప్రసక్తే లేదని ఆ పార్టీ జాతీయ కమిటీ ప్రధాన కార్యదర్శి సీతారామ్ ఏచూరి(Sitaram Echuri) ప్రకటించారు. కోయం బత్తూరులో శుక్రవారం ఉదయం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... తెలంగాణ సహా ఐదు రాష్ట్రాల శాసనసభ ఎన్నికలపై వెలువడిన సర్వేల ఫలితాలు బీజేపీకి వ్యతిరేకంగా ఉండటం హర్షణీయమన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఇప్పటివరకు 40 వేల కార్పొరేట్ సంస్థలకు పన్ను రాయతీ ప్రకటించిందని మండిపడ్డారు. ఇక దేశంలో నిరుద్యోగ సమస్య తీవ్రరూపం దాల్చిందని, ప్రజా సంక్షేమాన్ని విస్మరించిన మోదీ ప్రభుత్వాన్ని ఓడించేందుకు దేశ ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని చెప్పారు. లోక్‌సభ ఎన్నికల్లో ఇండియా కూటమి తప్ప కుండా విజయం సాధిస్తుందని, ఎన్నికల ఫలితాల తర్వాతే ప్రధాని అభ్యర్థిపై అన్ని పార్టీలు సమష్టిగా ఎంపిక చేస్తాయని సీతారామ్ ఏచూరి తెలిపారు.
Updated Date - 2023-12-02T07:48:43+05:30 IST