ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Sonia Retirement: రిటైర్మెంట్ ఉత్తదే...సోనియా అలా అనలేదు: కాంగ్రెస్

ABN, First Publish Date - 2023-02-26T17:49:36+05:30

'భారత్ జోడో యాత్ర'తో తన ఇన్నింగ్స్ ముగిసిందంటూ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు, యూపీఏ చైర్‌పర్సన్ సోనియాగాంధీ చేసిన వ్యాఖ్యలు సంచలనం కావడంతో ...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాయపూర్: 'భారత్ జోడో యాత్ర'తో తన ఇన్నింగ్స్ ముగిసిందంటూ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు, యూపీఏ చైర్‌పర్సన్ సోనియాగాంధీ (Sonia Gandhi) చేసిన వ్యాఖ్యలు సంచలనం కావడంతో ఆ పార్టీ ఆదివారంనాడు స్పష్టత ఇచ్చింది. సోనియాగాంధీ రిటైర్ కావడం లేదని, పార్టీకి ఆమె ఆశీస్సులు, మార్గదర్శకత్వం కొనసాగుతాయని పార్టీ అధికారి ప్రతినిధి అల్కా లంబా (Alka lamba) తెలిపారు.

ఛత్తీస్‌గఢ్ రాధాని రాయపూర్‌లో శనివారంనాడు జరిగిన ప్లీనరీ సమావేశంలో సోనియాగాంధీ ప్రసంగిస్తూ, భారత్ జోడో యాత్ర విజయవంతం కావడంతో తన ఇన్సింగ్స్ ముసిందంటూ వ్యాఖ్యానించారు. దీంతో ఆమె క్రియాశీలక రాజకీయాల్లో నుంచి తప్పుకుంటున్నట్టు వార్తలు వెలువడ్డాయి. దీనిపై ప్లీనరీ వేదికగానే అల్కా లంబా ఆదివారంనాడు స్పష్టత ఇచ్చారు. ''సోనియాగాంధీతో రెండు నిమిషాలు మాట్లాడే అవకాశం నాకు వచ్చింది. రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టుగా మీ మాటలను కొందరు అన్వయించి చెబుతున్నారని మేడమ్ (సోనియా)ను అడిగా. పార్టీకి నా అశీస్సులు, మార్గదర్శకత్వం ఉంటాయని, రాజకీయాల నుంచి తప్పుకోనని మేడం చాలా స్పష్టంగా చెప్పారు. ఈ విషయం మీతో పంచుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది'' అల్కా లంబా తెలిపారు. మీడియా కూడా ఈ విషయాన్ని గమనించాలని, సోనియగాంధీ ప్రసంగాన్ని తప్పుగా అర్ధం చేసుకోవద్దని కోరారు. ప్రత్యక్ష రాజకీయాల్లో సోనియాగాంధీ కొనసాగుతారని మరోసారి స్పష్టత ఇచ్చారు.

సోనియాగాంధీ తన ప్రసంగంలో 2004,2009 ఎన్నికల్లో పార్టీ సాధించిన విజయాలు, డాక్టర్ మన్మోహన్ సింగ్ సమర్ధ నాయకత్వం తనకెంతో సంతృప్తి కలిగించాయని, రాహుల్ సారథ్యంలోని భారత్ జోడో యాత్ర ముగింపుతో నా ఇన్నింగ్స్ ముగియడం సంతోషం కలిగిస్తోందని అన్నారు. సీనియర్లు, యువతను కలుపుకొని ముందుకు వెళ్లాలంటూ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకు దిశానిర్దేశం చేశారు.

Updated Date - 2023-02-26T18:23:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising