North Korea : పదేళ్ల కుమార్తె అలవాట్లపై కిమ్ జోంగ్ ఉన్ ఏమంటున్నారో చెప్పేసిన విదేశీ నిఘా సంస్థ!
ABN , First Publish Date - 2023-03-07T17:27:13+05:30 IST
ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ (North Korean leader Kim Jong Un) కుమార్తె కిమ్ జు ఆయే (Kim Ju Ae) వివరాలను దక్షిణ కొరియా
న్యూఢిల్లీ : ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ (North Korean leader Kim Jong Un) కుమార్తె కిమ్ జు ఆయే (Kim Ju Ae) వివరాలను దక్షిణ కొరియా గూఢచార సంస్థ ఆ దేశ చట్ట సభల సభ్యులకు తెలిపింది. ఆమె వయసు పదేళ్ళు అని, ఆమెకు పాఠ్యాంశాల బోధన ఇంట్లోనే జరుగుతోందని, ఆమె గుర్రపు స్వారీ, స్కీయింగ్, ఈత వంటివాటిలో శిక్షణ పొందుతున్నారని తెలిపింది. ఆమె గత ఏడాది నవంబరు నుంచి తన తండ్రితో కలిసి కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటుండటంతో ఆమెను తన వారసురాలిగా కిమ్ జోంగ్ ఉన్ ప్రకటించనున్నారా? అనే ఉత్కంఠ నెలకొన్న సంగతి తెలిసిందే.
కిమ్ జు ఆయేను తన వారసురాలిగా కిమ్ జోంగ్ ఉన్ ఎంపిక చేయలేదని దక్షిణ కొరియా ప్రభుత్వం చెప్తోంది. అయినప్పటికీ ఆయన ఆమెతో కలిసి తరచూ వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటుండంతో తన సంతానంలో ఎవరో ఒకరు భవిష్యత్తులో ఉత్తర కొరియాకు నేత అవుతారనే సంకేతాలను పంపిస్తున్నట్లు చర్చ జరుగుతోంది. ప్రస్తుతం ఉన్ ఆరోగ్యంగా ఉన్నారని, ఆయన వయసు కూడా చాలా తక్కువేనని మరికొందరు చెప్తున్నారు.
కిమ్ జు ఆయేకు ఓ అన్నయ్య ఉన్నాడు. ఆమె తర్వాత మరొకరు జన్మించారు. కానీ ఆ తోబుట్టువు ఆడ? మగ? అనే విషయం బయటి ప్రపంచానికి తెలియదు. ఆమె అన్నయ్యకు శారీరక లేదా మానసిక సమస్యలు ఉన్నాయా? అనే విషయం కూడా వెల్లడికావడం లేదు. గుర్రపు స్వారీలో ఆమె నైపుణ్యాన్ని కిమ్ జోంగ్ ఉన్ ప్రశంసిస్తుంటారని తెలిసింది.
ఇవి కూడా చదవండి :
Congress Vs BJP : స్వదేశాన్ని అవమానిస్తున్న రాహుల్ గాంధీ : రవిశంకర్ ప్రసాద్
Odisha : నీటి కోసం చిన్నారుల అష్టకష్టాలు